calender_icon.png 12 July, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల పోరాట ఫలితమే 42 శాతం రిజర్వేషన్స్

11-07-2025 11:04:24 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించినందుకుగాను జిల్లా బీసీ సంఘం నాయకులు హర్ష వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని సారపాకలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు మహంకాళి రామారావు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 60 శాతం పైబడి ఉన్నటువంటి బీసీలకు గత 60 సంవత్సరాలుగా బీసీలకు రిజర్వేషన్లు విషయంలో అన్యాయం జరుగుతుందని తెలిపారు.

జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పోరాటాల ఫలితమే నేడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు కారణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగనన ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో రానున్న స్థానిక ఎన్నికలలో బీసీలకు సముచిత స్థానం కల్పించి న్యాయం చేయాలని కోరారు. రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలలో సర్పంచ్, ఎంపీటీసీ,ఎంపీపీలుగా బీసీ సోదరులు ఉండాలని పేర్కొన్నారు.