28-07-2025 10:50:04 PM
సూర్యాపేట (విజయక్రాంతి): పట్టణంలోని ప్రముఖ సెవెన్ స్టార్ హోటల్‌ను మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి(Municipal Commissioner Hanumantha Reddy) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హోటల్‌లో పారిశుద్ధ్య పరిస్థితులు, నాణ్యత ప్రమాణాలు, నిల్వ ఆహార పదార్థాల పరిస్థితిని పరిశీలించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించి వ్యాపార లాభాల కోసం గడువు ముగిసిన పదార్థాలు లేదా శుభ్రత లేని వంట గదులు వాడితే, ఆహార భద్రతా చట్టాల కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హోటల్ యాజమాన్యానికి పలు సూచనలు చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మున్సిపల్ విభాగం తరచుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుందని, పట్టణంలోని ఏ హోటల్ అయినా నిబంధనలు తప్పితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈయన వెంట పలువురు సిబ్బంది ఉన్నారు.