calender_icon.png 29 July, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహార భద్రత కార్డు అనేది నిరంతర ప్రక్రియ

28-07-2025 10:52:19 PM

ఆర్డీవో సూర్యనారాయణ..

చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో సోమవారం కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ(RDO Suryanarayana) చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకుపోతుందని ఆయన అన్నారు. చిలుకూరు మండలంలో కొత్తగా రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకున్న వారికి 1218, రేషన్ కార్డులు రావడం జరిగిందని, 1463 పేర్లను పాత రేషన్ కార్డుల్లో నమోదు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఆహార భద్రత కార్డు అనేది నిరంతరం ప్రక్రియ అని కొత్తగా అప్లై చేసుకున్న వారు ఉంటే రాలేదని నిరాశ చెందొద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ధ్రువ కుమార్, ఎంపీడీవో గిరిబాబు, ఆర్ ఐ లు, సీతయ్య, శ్వేత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీత  వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, పాల్గొన్నారు.