08-09-2025 12:00:00 AM
సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య
అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 7 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలోపు అనాజ్‌పూర్ రైతుల సమస్యలను పరిష్కరించాలని.. లేకపోతే రైతులందరూ స్థానిక పోరులో పోటీ ఉంటారని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్యా అన్నారు. అనాజ్‌పూర్ గ్రామంలో సీలింగ్ రైతులు గత వారం రోజుల నుంచి గ్రామపంచాయతీ దగ్గర రిలే నిరాహార దీక్షలు చేస్తున్న శిబిరాన్ని స్థానిక సీపీఎం నాయకులతో కలిసి సందర్శించి దీక్షలకు విరమింపజేశారు.
ఈ సందర్భంగా పగడాల యాదయ్య మాట్లాడుతూ.. రైతులకు పట్టా పాసుబుక్కులు ఇచ్చేంతరకు పలు విధాల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గత ఆరు నెలల నుంచి వివిధ ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నా.. గ్రామంలో ఉన్న ఏ ఒక్క లీడర్ కూడా మద్దతు తెలుపకపోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలోపు సీలింగ్ రైతుల సమస్య లను పరిష్కరించకపోతే.. రైతులందరూ పోటీలో ఉంటారని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రభు త్వం వెంటనే స్పందించి రైతులకు అనుకూలంగా ఉండి... ఆన్‌లైన్ చేసి.. పట్టా పాసుబుక్కులిచ్చి.. రైతు భరోసా, రైతు బీమా వంటి సౌకర్యాలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా, రైతులు బిక్షపతి, కావాలి రాములు, అరకలి మహేష్, ఇంజమూర్ రవి, అనకాపల్లి మహేష్, శ్రీను, కావలి మల్లేష్, బాటని బాలరాజ్, సీపీఎం మండల నాయకులు వర్కల ముత్యాలు, కావలి జంగయ్య, పరకాల ముత్యాలు, గురుజని యాదయ్య, బాటని జంగయ్య, ఉప్పుల వెంకటేష్, ఎస్ లింగస్వామి పాల్గొన్నారు.