08-09-2025 12:00:00 AM
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి
అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 7: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన తెలంగాణ సాయుధపోరాట యోధుడు, మాజీ నల్గొండ పార్లమెంట్ సభ్యులు రావి నారాయణరెడ్డి జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి అన్నారు.
ఆదివారం పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధి రావినారాయణరెడ్డి కాలనీ ఫేస్2లో రావినారాయణరెడ్డి 34వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవీంద్ర చారి మాటా ్లడుతూ.. తెలంగాణ రాచరిక వ్యవస్థను భూస్థాపితం చేయడంలో రావి నారాయణరెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు.
సాయుధ పోరాట యోధులతోనే సెప్టెంబరు 17న తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించిదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ మండల కార్యదర్శి అజ్మీర హరి సింగ్ నాయక్, నాయకులు కేతరాజు నరసింహ, కాటి అరుణ, వట్టి నవనీత, వేషాల నరసింహ, పొన్నాల యాదగిరి, సైదులు, పేరాల గోపి, సుధాకర్, గడ్డం నరసింహ తదితరులు పాల్గొన్నారు.