calender_icon.png 15 November, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలనకే పట్టం కట్టిన జూబ్లీహిల్స్ ప్రజలు

15-11-2025 06:39:16 PM

సిరిసిల్ల ప్రెస్ మీట్ లో కేకే మహేందర్ రెడ్డి..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు రెఫండర్ మని మాట్లాడిన కేటీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజకీయ సన్యాసం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మేం ముందే భాషించిందేనని అన్నారు. పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. బిజెపి బిఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలను కనిపెట్టిన జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు రెఫరెంటామని మాట్లాడిన కేటీఆర్ మరి ఇప్పుడు శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ తెలంగాణ బిడ్డవైతే ఈ ఎన్నికలను రెఫరెండంగా స్వీకరించి రాజకీయాల నుండి తప్పుకోవాలన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ రాజకీయ పరిపక్వతతో మాట్లాడి ప్రజల మనలను పొందాలని లేకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని కేకే మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ వెనకాల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుగుల స్వరూప రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, ఆడెపు చంద్రకళ, కల్లూరి చందన, ఎల్లే లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుబాల వెంకటేశం, వేముల రవి, తదితరులు పాల్గొన్నారు.