15-11-2025 06:28:10 PM
రైతులకు రబి పంట బోనస్ వెంటనే అందజేయాలి..
బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు..
కరీంనగర్: ప్రభుత్వం రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేస్తుందని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులు పండించిన చివరి గింజల వరకు కొనుగోలు చేస్తామని చెప్పి, 500 బోనస్ చెల్లిస్తామని గత రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. మళ్లీ రబి సీజన్ ప్రారంభం మళ్లీ అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడం హేయమైన చర్య అని అన్నారు.
బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నప్పటికీ 500 రూపాయల బోనస్ కు ఆశపడి రైతులు ప్రభుత్వానికి అమ్మారని రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగా, మోసం చేస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పి 50% రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకుందన్నారు. రైతులకు సరైన సమయంలో ఎరువులను సరఫరా చేయకుండా రైతులను రోడ్డుమీద పడేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ పబ్బం కడుపుకుంది తప్ప రైతులకు చేసింది ఏమిలేదన్నారు. రైతులకు వెంటనే బోనస్ చెల్లించకపోఏమితే అన్నదాతల ఆగ్రహానికి గురిగాక తప్పదని హెచ్చరించారు.