calender_icon.png 15 November, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్షిక తనిఖీలలో భాగంగా ఆత్మకూరు సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ

15-11-2025 06:43:56 PM

పోలీసుల సేవల ప్రమాణాన్ని పెంచడమే పోలీసు లక్ష్యం

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్..

వనపర్తి క్రైమ్: సర్కిల్ కార్యాలయ పనితీరు, రికార్డులు, భద్రతా ప్రమాణాలపై సమగ్ర సమీక్ష, రాత్రి సమయాలలో మరింత పటిష్టంగా గస్తీ నిర్వహిస్తూ నేరాల నియంత్రణ చేయాలి. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా ఉండాలి. నేరాల అదుపులకు పటిష్టమైన చర్యలు చేపడుతూ గస్తీ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ అన్నారు. శనివారం రోజు వనపర్తి జిల్లా పరిధిలోని ఆత్మకూరు సర్కిల్ కార్యాలయాన్ని "వార్షిక తనిఖీలలో" భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు పూల బుద్ధి అందజేసి స్వాగతం పలికారు.

అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అనంతరం సర్కిల్ కార్యాలయంలో రికార్డ్స్ ను, తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు. సర్కిల్ కార్యాలయం పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు వివరాలు, నేరస్థుల ప్రస్తుత పరిస్థితులు ఏవిధంగా ఉన్నవి తదితర వివరాలను పెండింగ్ లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను ఆత్మకూరు సీఐ, శివకుమార్ ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పోలీసు వ్యవస్థ యొక్క బలం క్రమశిక్షణ, కర్తవ్యనిష్ఠ, పారదర్శకత. వార్షిక తనిఖీలు కేవలం పరిశీలన మాత్రమే కాదు సేవా ప్రమాణాలను ఇంకా మెరుగుపరచే అవకాశం. ప్రజలు పోలీసులపై నమ్మకం ఉంచే విధంగా ప్రతి అధికారి పనిచేయాలి.

శుభ్రత, రికార్డులు, స్పందన సమయాలు, ప్రజా సేవలో వినయశీలత ప్రతి పోలీసు అధికారి ప్రధాన ధ్యేయం కావాలి. వనపర్తి జిల్లా ప్రజల భద్రత కోసం మా యంత్రాంగం ఎప్పుడూ సజ్జంగా ఉంటుంది పోలీసు శాఖ శక్తి మా క్రమశిక్షణలో, సేవా నిబద్ధతలో ఉంటుంది. వార్షిక తనిఖీలు ఒక బాధ్యత పరిశీలన మాత్రమే కాదు – ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే మార్గం. ప్రతి పోలీసు అధికారి ప్రజల భద్రత, న్యాయం, విశ్వాసం అనే మూడు ముఖ్య లక్ష్యాలను ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకుని పనిచేయాలి. సర్కిల్ కార్యాలయంలో శుభ్రత, రికార్డుల పారదర్శకత, స్పందన వేగం, ప్రజలతో వ్యవహరించే తీరు  ఇవే పోలీసు శాఖ నిజమైన ప్రతిఛాయ. నేరాల నియంత్రణ కోసం గస్తీ, పహారా మరింత బలోపేతం చేసి, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయడం మనమందరి బాధ్యత. వనపర్తి జిల్లా ప్రజల భద్రత, శాంతి, సౌకర్యం కోసం మా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు, ఆత్మకూరు సీఐ, శివకుమార్, డిసిఆర్బి ఎస్సై, తిరుపతిరెడ్డి  పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.