calender_icon.png 15 November, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

15-11-2025 06:45:48 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం పరిశీలించారు. వెలుగనూరు గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ఆయన మాట్లాడుతూ  ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. సుల్తాన్ నగర్ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఆయన స్థానిక అధికారుల ను ఆదేశించారు. ఆయన వెంట స్థానిక తహసిల్దార్ బిక్షపతి, ఎంపీడీవో శివ కృష్ణ, ఎంపీ ఓ అనిత, ఆర్ఐ సాయిలు, తదితరులు ఉన్నారు.