15-11-2025 06:30:38 PM
ముకరంపుర (విజయక్రాంతి): బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శిగా వాయిల రాజ్ కుమార్ నియమితులయ్యారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ నియామక పత్రం అందజేశారు. ఇట్టి నియమకానికి సహకరించిన బీసీ సంక్షేమ, అనుబంధ సంఘ నాయకులకు వాయిల రాజ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధికి, బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, బీసీ పథకాలు ఎలా అమలు చేసుకోవాలని ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.