15-11-2025 06:32:54 PM
సుల్తానాబాద్ జడ్జి దుర్గం గణేశ్..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): లోక్ అదాలత్ లో రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చునని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణలో శనివారం జడ్జి దుర్గం గణేశ్ స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకు సమ న్యాయం జరుగుతుందని, ఇరు పక్షాల అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవచ్చని అన్నారు.
స్పెషల్ లోక్ అదాలత్ లో పలు క్రిమినల్ కేసులు, కుటుంబ వివాదాలు, భూమి తగాదాలు, ప్రమాదాలు, చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి (54) కేసులు పరిష్కరించారని కోర్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయిని భూమయ్య, ఏపీపీ శ్యాం ప్రసాద్ రావు, ఏజీపీ దూడం ఆంజనేయులు, లోక్ అదాలత్ సభ్యులు మాడూరి ఆంజనేయులు, చీకటి సంతోష్ కుమార్, న్యాయవాదులు ఆలూరి శ్రీనివాస రావు, వొడ్నాల రవీందర్, ఆకారపు సరోత్తం రెడ్డి, అవునూరి సత్యనారాయణ, జోగుల రమేష్, సామల రాజేంద్ర ప్రసాద్, వేముల స్నేహ, మడూరి పృథ్వీ, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.