15-11-2025 06:54:12 PM
బిచ్కుంద (విజయక్రాంతి): మద్నూర్ లో శ్రీ వీరభద్ర స్వామి మహోత్సవాలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా వందలాది భక్తులు తరలివచ్చి ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. భక్తులందరూ సాంప్రదాయం ఆచారాలను పాటించారని నిర్వాహకులు సంగాయప్ప తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం నుండి కూడా పెద్ద యెత్తున భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా అగ్నిగుండంల వందల సంఖ్యలో పాల్గొనడం విశేషం. మొదటి రోజు నుంచే ఆలయ ప్రాంగణం పూజలతో కిక్కిరిసిపోయింది. భక్తులు భజనలు, హారతులతో శ్రీ వీరభద్ర స్వామిని దరిచేరి తమ కోరికలు తీర్చాలని ప్రార్థించారు. రెండవ రోజు జరిగిన అన్నదాన మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో ప్రసాదం స్వీకరించారు. మూడవ రోజు నిర్వహించిన అగ్నిగుండం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.