26-07-2025 12:10:24 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): అంగన్వాడి టీచర్లకు బిఎల్ఓ డ్యూటీలో నుండి మినహాయింపు ఇవ్వాలని, అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు వినతి పత్రం సమర్పించారు. బీఎల్ఓ డ్యూటీకి సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించాలని, కుల గణన చేసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లో సిగ్నల్ లేక నోడ్ క్యాప్చర్ కావటం లేదని ప్రభుత్వం వెంటనే స్పందించి సిగ్నల్ వచ్చే మొబైల్ ఫోన్లను ఇవ్వాలని కోరారు.