calender_icon.png 16 August, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా ఆంజనేయస్వామి విగ్రహం, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన

16-08-2025 12:53:38 AM

ప్రతి ఒక్కరు దైవచింతన కలిగి ఉండాలి... శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తాండూరు, 15,ఆగస్టు (విజయక్రాంతి) . పెద్దముల్ మండలం పెద్దముల్ తండాలో శ్రీ వీరాంజనేయ స్వామి  విగ్ర హం మరియు ధ్వజ స్తంభం శుక్రవారం మా జీ జెడ్పిటిసి ధారాసింగ్ దంపతులు, గ్రామస్తులు ఘనంగా భక్తిశ్రద్ధలతో ప్రతిష్టాపన చేశారు. గణపతి హోమం, నవగ్రహ పూజ, ఆలయ శిఖరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరిగింది. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తాం డూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి భక్తి భావం పెంపొందించుకోనీ సుఖసంతోషాలతో జీవించాలని కోరారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామస్తులు ,యువకులు భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ పూజల్లో స్థానిక ప్రజలు వివిధ గ్రామాల భక్తులు ,మహిళలు, చిన్నారుల తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు భారీగాపాల్గొన్నారు.