calender_icon.png 17 August, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగతనం జరిగిన 24 గంటల్లో దొంగల అరెస్టు, రిమాండ్

16-08-2025 12:53:27 AM

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 15 (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణ ఇన్‌స్పెక్టర్ కే కృష్ణ  మాట్లాడుతు. తేది 13-08-2025 రోజున సాయంత్రం  అందాదా 4.50 గంటల సమయం లో పిర్యాది పడాల స్రవంతి r/o నిర్మల్ అనునామే సిరిసిల్లకి పెళ్ళికి వచ్చి తిరిగి  నిర్మల్ వెళ్ళుటకు సిరిసిల్ల లోని పాత బస్టాండ్ కు వచ్చి బస్సు ఎక్కి తన హ్యాండ్ బ్యాగ్ చుసుకోగా, హ్యాండ్ బ్యాగ్ జిప్ తెరిచి ఉండి  అందులో పెట్టుకొన్న బంగారు నగలు గల ప్లాస్టిక్ బాక్స్ కనిపించటం లేదని, అందులో అందాద 14 తులాల బంగారు నగలు ఉన్నాయని,

బస్సు ఎక్కే సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకుపోయినారని ఈ రోజు అనగా 14- నాడు పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని పోలీస్ సిబ్బందిని మూడు బృందాలుగా ఏర్పరచి  సీసీటీవీ కెమెరాల సహాయం తో నిందితులను గుర్తించి పట్టుకొని వారి వద్ద నుండి 14 తులాల బంగారు నగలను స్వాదిన పరుచుకొని నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకి పంపనైనది అని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కె. కృష్ణ తెలిపినారు. నిందితులు గత కొద్ది నెలలుగా రద్దీగా ఉండే ప్రదేశాలలో జనాలతో కలిసి చిన్న చిన్న దొంగతనాలకి పాల్పడుతున్నారు. వీరిని పట్టుకోనుటలో సిరిసిల్ల పట్టణ పోలీస్ సిబ్బందిని పేరు పేరునా సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ అభినందిం చినారు.

స్వాధీనం చేసిన వస్తువులు,స్మార్ట్ ఫోన్లు 5, బంగారు ఆభరణాలు 14 తులాల .పై విషయం గురించి సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ K. కృష్ణ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణం లో ఎవరైనా మహిళలు బస్టాండ్ లలో  గాని మార్కెట్ ఏరియాలో గాని రద్దీ ప్రదేశాలలో కి వెళ్ళినపుడు మీ యొక్క బంగారు ఆభరణాలు, డబ్బులను జాగ్రత్తగా పెట్టుకోవాలి అదే విదంగా  మీ యొక్క చుట్టూ ప్రక్కల వారిని గమనించాలి, రద్దీగా ఉనా సమయంలో బస్సు ఎక్కినత్లయితే  చుట్టుపక్కల వారిని గమనించాలి.

ఇంటికి తాళం వేసి పని పైన గాని, పండగలకు గాని వెళ్ళినట్లయితే పోలీస్ స్టేషన్ లో తప్పకుండ తెలుపగలరని, ప్రతి ఇంటికి తప్పనిసరిగా సీసీటీవీ కేమేరాలు పెట్టుకోవాలని  విషయంలో అప్రమత్తంగా ఉండాలని  నేరనియంత్రణలో భాగాసమ్యులు కావాలని  తెలిపారు.