calender_icon.png 27 January, 2026 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయోవా జైలులో అన్మోల్

21-11-2024 01:14:21 AM

భారత్‌కు తీసుకొచ్చేందుకు ఎన్‌ఐఏ ప్రయత్నాలు

న్యూఢిల్లీ, నవంబర్ 20: అమెరికాలో అరెస్టయిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్‌ను అయోవా రాష్ట్రంలోని పొట్టవట్టయి కౌంటీ జైలుకు తరలించారు. అన్మోల్‌ను కాలిఫోర్నియాలో అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చినా అయోవాలోనే ఉన్నట్లు తాజాగా స్పష్టమైంది. అతని వద్ద ఉన్న భారత పాస్‌పోర్టు ఆధారంగా గుర్తించి అరెస్టు చేసినట్లు భారత దౌత్య అధికారులు ధ్రువీకరించారు. అన్మోల్‌పై పంజాబ్, ముంబై, ఢిల్లీలో దాదాపు 20 కేసులు ఉన్నాయి.

మనీలాండరింగ్ అనుమానాలపై ఈడీ కూడా దర్యాప్తు మొదలుపెట్టింది. అయితే, అన్మోల్ అప్పగింత కోసం రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ.. అమెరికా ఎఫ్‌బీఐతో టచ్‌లో ఉంది. అక్కడ కోర్టుకు తీసుకెళ్లకుండానే నేరుగా భారత్‌కు తరలించేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.