calender_icon.png 27 January, 2026 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ గొంతు నాది కాదు

21-11-2024 01:18:42 AM

బిట్‌కాయిన్ ప్రచారంలో వాడిన ఆడియో పేక్

ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే

ముంబై, నవంబర్ 20: బిట్‌కాయిన్ లావాదేవీలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే స్పందించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బుధవారం ఓటు హక్కు వినియోగించుకున్న ఆమె.. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. బిట్‌కాయిన్ల గురించి ప్రచారంలో ఉన్న  వాయిస్ నోట్స్, సందేశాలన్నీ నకిలీవని, అది తన వాయిస్ కాదని వివరణ ఇచ్చారు.

కావాలనే బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది తనపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా త్రివేదిపై పరువు నష్టం దావా నోటీసులు పంపినట్లు వెల్లడించారు.