17-05-2025 05:45:53 PM
జైపూర్ (విజయక్రాంతి): తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (Telangana Forest Development Corporation) మంచిర్యాల రేంజ్ లోని జైపూర్ సిరీస్ లో పనిచేస్తున్న ఎ సాయికిరణ్ ఉత్తమ ప్లాంటేషన్ వాచర్ గా ఎంపికయ్యారు. టీజీఎఫ్‌డీసీ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో డివిజన్ ల వారీగా ప్రకటించిన జాబితాలో ఇక్కడి కాగజ్ నగర్ డివిజన్ లోని మంచిర్యాల రేంజ్ నుంచి సాయికిరణ్ ఎంపికయ్యారు. గత 10 సంవత్సరాలుగా ప్లాంటేషన్ లను రక్షిస్తూ మంచి పనితీరు ప్రదర్శిస్తున్నందుకు ఈ అవార్డు ప్రకటించారు. ఈ సందర్బంగా శుక్రవారం రాత్రి డివిజన్ కేంద్రమైన కాగజ్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ శ్రావణి చేతుల మీదుగా సాయికిరణ్ ప్రశంసా పత్రంతో పాటు 5000 రూపాయల నగదు బహుమతి అందుకున్నారు. సాయి కిరణ్ ను టీజీఎఫ్‌డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ తో పాటు రేంజ్ సిబ్బంది అభిందించారు.