05-09-2025 02:03:59 AM
-శ్రీనివాస్‌గుప్తా ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కొత్తపేట గాయత్రిపురం కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి, సాయిబాబా దేవాలయంలో దేవాలయ సలహాదారుడు ఏఆర్ గుప్త ఆహ్వానం మేరకు గురువారం పీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రా ష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజ కార్యక్ర మంలో పాల్గొని, అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో విజ్ఞాలు తొలిగి ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాయత్రిపురం రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ బాలరాజు, జితేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్, కోశాధికారి సోమ అనంత రాములు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.