calender_icon.png 5 September, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపే మహా గణపతి నిమజ్జనం

05-09-2025 02:03:42 AM

  1. గురువారం అర్ధరాత్రి ముగిసిన ఖైరతాబాద్ గణేషుడి దర్శనం

శనివారం ఉదయం 6 గంటలకు శోభయాత్ర 

మధ్యాహ్నం 1:30 లోపు గంగమ్మ చెంతకు గణపతి

పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డ్, పోలీస్ శాఖల సమన్వయం

నేడు దర్శించుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఖైరతాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహా గణేశుడి నిమజ్జనం శనివారం నిర్వహించనున్నారు. అందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ సంవత్సరం మహా విశ్వశాంతిమూర్తిగా ఖైరతాబాద్ గణేషుడు భక్తులను దర్శనమిచ్చాడు. అయితే గురువారం అర్ధరాత్రి 12 గంటలకే గణపతి దర్శన భాగ్యం ముగిసింది. గురువారం ఆఖరి రోజు కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివ చ్చారు.

కాగా మొత్తంగా 30 లక్షల వరకు భక్తులు మహా గణనాథుడ్ని దర్శించుకున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ౧౦ గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి మహా గణపతిని దర్శించుకోనున్నారు. కాగా గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఉత్సవ కమిటీ సభ్యులు కలశపూజ నిర్వహించి షెడ్డు తొలగింపు కార్యక్రమాలను ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం మహా గణప తిని కదిలించి క్రేన్‌పై వెల్డింగ్ కార్యక్రమాలను మొదలుపెడతామని ఉత్సవ కమిటీ సభ్యు లు తెలిపారు.

శనివారం నిమజ్జనానికి పక్కా ప్రణాళికతో జిహెచ్‌ఎంసి, వాటర్ బోర్డ్, పోలీస్ శాఖలతో పాటు వివిధ శాఖల సమన్వయంతో సర్వం సిద్ధం చేస్తున్నారు. శని వారం ఉదయం 6 గంటలకు శోభయాత్ర ప్రారంభమై, మధ్యాహ్నం 1:30 లోపు పూర్తవుతుంది. నిమజ్జనాన్ని ప్రత్యేకంగా వీక్షించేం దుకు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 

శోభాయాత్రకు భారీ బందోబస్తు: సంజయ్ కుమార్, ఏసీపీ, సైఫాబాద్ 

మహా గణేషుడి శోభయాత్రలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బం దోబస్తును ఏర్పాటు చేశాం. నగర పోలీసులతోపాటు వివిధ జిల్లాల నుంచి ప్రత్యేకంగా పోలీసులతో హైదరాబాద్ నగరంలో బందోబస్తు నిర్వహిస్తున్నాం. 

కంట్రోల్ రూంల ఏర్పాటు

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేకంగా విద్యుత్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్‌లను గురువారం సంస్థ డైరెక్టర్లు నర్సింహులు, చక్రపాణి, శ్రీ కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నిమజ్జన కార్యక్రమం ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఆపరేషన్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ మాట్లాడుతూ.. గణేష్ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే ప్రధాన రహదారుల, ఇతర రహదారుల మ్యాప్ రూపొందించినట్టు పేర్కొన్నారు.

గ్రేటర్ పరిధిలోని ఇంజినీరింగ్, ఆపరేషన్, మెయింటనెన్స్ విభాగాలకు చెందిన దాదాపు 9 వేల మంది నిమజ్జన కార్యక్రమం ముగిసే వరకు విధుల్లో ఉంటారని తెలిపారు.  విద్యుత్ శాఖ ఏర్పాటు చేసే ప్రత్యేక కంట్రోల్ రూంలకు తోడు, జాయింట్ కంట్రోల్ రూమ్ లలో కూడా విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

ప్రజలు, మండప నిర్వాహకులు హుసైన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో, మరే ఇతర విద్యుత్ సంబంధిత సమస్య వున్నా ఎన్టీఆర్ మార్క్ కంట్రోల్ రూమ్ 8712468535, 8712469909, 8712469897 ట్యాంక్ బండ్ కంట్రోల్ రూమ్ 8471246994, 8712469892, 8712470026 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.

  1. 51 లక్షలు పలికిన లడ్డూ 
  2. రాయదుర్గం మై హోమ్‌భుజాలో వేలం

రాయదుర్గంలోని మై హోమ్ భుజాటలో గణనాథుడి లడ్డూ వేలం లో రూ.51 లక్షలు పలికింది. తొమ్మిది రోజులు అత్యంత ప్రతిష్టాత్మకంగా పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డూను వేలం వేశారు. ఈ వేలంపాటలో ఇల్లందుకు చెందిన గణేశ్ అనే వ్యక్తి రూ.51 లక్షలకు పాడి దక్కించుకున్నాడు. గతేడాది కూడా ఆయనే రూ.29 లక్షలకు దక్కించుకోగా.. ఈ ఏడాది కూడా ఆయనే రూ.50 లక్షలకు సొంతం చేసుకోవడం విశేషం.