calender_icon.png 5 September, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వే నంబర్ 329లో పాక్షిక కూల్చివేతలు

05-09-2025 02:05:31 AM

-స్పందించిన ఆర్డీవో శ్యామ్

- మరి ఇంకో రూమ్ సంగతేంది?

-ఒక రూమ్ కూల్చి మరోదాన్ని కాపాడి..

-ఆ అక్రమ రూమ్ సక్రమంగా నిర్మించినట్లేనా?

కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ప్రభుత్వ భూముల కబ్జాలకు యత్ని స్తే ఊరుకోబోమని చట్టపరంగా వారు సమస్యలను ఎదురుకోవాల్సి వస్తుందని ఆర్డీవో శ్యామ్ హెచ్చరించారు. కుత్బు ల్లాపూర్ మండ ల పరిధి దేవేందర్ నగర్ శివయ్య బస్తికి ఆనుకొని సర్వే నెంబర్ 329 లో గల కబ్జాలను గురువారం ఆర్‌డిఓ శ్యామ్ ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు.

‘విజయక్రాంతి’  పత్రికలో ప్రచురితమైన వార్తలకు స్పందించి న ఆర్‌డిఓ శ్యామ్ పోలీసుల సహకారంతో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన గదులను నేలమట్టం చేపించారు. కానీ అక్కడ రెండు రూములు నిర్మిస్తే రెవెన్యూ అధికారులు ఒక రూమ్ మాత్రమే కూల్చివేశారు. మరో రూమ్ సక్రమమేనా..? ఏమో మరీ ఆర్‌డిఓ కూల్చి వేయమని ఆదేశాలు జారీ చేసినా కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు మాత్రం ఒక రూమ్ కూల్చడం పలు అనుమానాలకు తావిస్తుంది.