calender_icon.png 26 November, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా శ్రీ సర్వదేవత పరంజ్యోతి ఆలయ 24 వ వార్షికోత్సవం

26-11-2025 12:00:00 AM

  1. వేలాదిగా తరలివచ్చిన భక్తులు

2800 వందల మందికి అన్న ప్రసాద వితరణ

కామారెడ్డి, నవంబర్ 25 (విజయ క్రాంతి):  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంగళవారం కల్కినగర్ లో గల శ్రీ సర్వదేవత పరంజ్యోతి భగవతి ఆలయ 24 వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ వార్షికోత్సవంలో భాగంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటుగా నిజామాబాద్,కామారెడ్డి మెదక్ జిల్లాల నుండి భక్తులు వేల సంఖ్యలో పాల్గొనడం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు మాలవిరమణ చేసి శ్రీ సర్వదేవత పరంజ్యోతి భగవతిని దర్శించుకోవడం జరిగింది.

ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని,  ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.అమ్మ భగవానుల అందజేస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజలకు అందజేయడం జరుగుతుందని ఆలయ సేవకులు పేర్కొనడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమానికి అన్న ప్రసాద దాతగా ముందుకు వచ్చిన చిలువేరి మారుతి శ్రీదేవి దంపతులను ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది.ప్రజలు పరంజ్యోతికి వారి సమస్యలను విన్నవించుకుని అనుగ్రహాన్ని పొందడం జరిగింది.

24 సంవత్సరాల నుండి ఎన్నో సామాజిక సేవలను నిర్వహించడంతోపాటుగా గడిచిన ఐదు సంవత్సరాల నుండి ప్రతి మంగళవారం అన్నప్రసాద వితరణ రెండు సంవత్సరాల నుండి పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుందని దీనికి ఎంతో మంది దాతలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక సహకారాన్ని అందజేస్తున్నారని వారి కుటుంబాలకు శ్రీ సర్వదేవతా పరంజ్యోతి అనుగ్రహం ఉంటుందని వారి కుటుంబాల అభివృద్ధికి ప్రత్యేక ప్రార్థనలను చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ సమన్వయకర్త ఎర్రం చంద్రశేఖర్ చంద్రకళ సేవకులు ఎర్రం విజయ్ కుమార్,డాక్టర్ బాలు,పాత స్వరూప,శ్రీనివాస్,దిగంబర్, పప్పుల రాజేంద్రప్రసాద్ శ్రావణి,ప్రసన్న,జ్యోతి,పబ్బ అనసూయ,పద్మ,సువర్ణ, తాటిపాముల సుధాకర్ వినోద్,వెంకటేశం,రామేశ్వర్ పల్లి శ్రీనివాస్,శ్రీదేవి లు పాల్గొనడం జరిగింది.