calender_icon.png 26 November, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదకర పరిస్థితిలో అయిజ పెద్దవాగు వంతెన

26-11-2025 12:00:00 AM

అయిజ, నవంబర్ 25: జోగులమ్మ గద్వాల జిల్లా అయిజ నుండి కర్నూలు వెళ్ళే రోడ్డు పై సుమారు 70,80 సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెన పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. అట్టి వంతెన పై ఈరోజు బిజెపి నాయకులు కోత్త బిడ్జి నిర్మాణం చేయాలని శిథిలమైన బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. దానివల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగినది.  సుమారు అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయి.

మూడు రాష్ట్రాలను కలిపే రహదారి అయినందువల్ల వాహనాల రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్రిడ్జి పై పగుళ్లు వచ్చి రంద్రాలు ఏర్పడి వాహనాలు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున ఇట్టి బ్రిడ్జిని నిర్మించాలని రాస్తారోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.