15-04-2025 12:42:59 AM
కొత్తగూడెం, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని శ్రీ పాండురంగ భజన మందిరంలో కొలువుదీరిన శ్రీ షిరిడి సాయి బాబా, శ్రీ కుసుమహల్ బాబా ల మొదటి వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట గావించి నేటికీ ఒక సంవత్సరము పూర్తయిన సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ కుసుమనాధ బాబా వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత,వైభవ్వేదంగా జరిగాయి.
ఉదయం 6 గంటల నుండి 108 కలశాలు స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, అనంతరం 108 కలశాల నీటి, పంచామృతాలతో స్వామివారికి, అభిషేకాలు చేసారు. అనంతరం అర్చకులు శ్రీరంగం వెంకటరమణాచార్యులు, శ్రీరంగం రంగాచార్యులు, పండిత్ దినేష్ కుమార్ శర్మ, వేదుల శ్రీరామచంద్రమూర్తి, కంచర్ల మధుకుమారాచార్యులు స్వామివారికి ప్రత్యేకమైన హోమా కార్యక్రమం నిర్వహించి,భక్తుల ను దీవించారు. అనంతరం అన్న సమారాధన క నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రు లయ్యారు.