calender_icon.png 7 May, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంద వినోద మే

04-05-2025 12:00:00 AM

మే అంటే ఎండలు మండే నెల. ఈ ఎండల్లో హృదయానికి హాయిగొలిపేది సినిమానే. సినీ పరిశ్రమకు కాసులు కురిపించే మాసం కూడా ఇదే. ఈ నెలలో తెలుగు, తమిళ భాషల్లో వెండితెరపై తమ అందచందాలతో అలరించేందుకు పలువురు హీరోయిన్లు ముస్తాబయ్యారు. మరి ఈ మండుటెండల్లో మది నిండా ఆనందాన్ని నింపుతున్న ఆ అందాల తారాతీరాన్ని మీరూ ఆస్వాదించండి. 

అన్నిరంగాల వారూ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఆహ్లాదకరమైన ప్రకృతిలోకి పరుగులు తీయాలనో, వినోదాన్ని పంచే మాధ్యమాల వైపో చూస్తారు. ఇక వినోదాన్ని అందించే మాధ్యమాలు అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది సినిమానే. వినోదం పొందేందుకు మరెన్నో మార్గాలున్నా తెలుగువారు ఎంచుకునే మొదటి చాయిస్ బిగ్‌స్క్రీన్‌పై జరిగే మ్యాజిక్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయడమే. మరి ఆ సినిమాలో కంటికి ఇంపైన, మనసుకు హాయిగొలిపే సన్నివేశాలుంటే, ఆ వినోదం తాలూకు సంతృప్తే వేరు! 

మృదుల పాత్రలో హృదయాలను చేరిన శ్రీనిధిశెట్టి 

నాని కథానాయకుడిగా నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్: ది థర్డ్ కేస్’. డాక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ సినిమా మే 1న పాన్ ఇండియాగా విడుదలైంది. ఇందులో శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా నటించింది. మృదుల పాత్రలో నటించిన శ్రీనిధిని లవ్‌ట్రాక్‌కే పరిమితం చేశారేమోనని చాలా మంది అనుకున్నారు కానీ, సినిమాలో ఆమె ప్రాధాన్యం ఉన్న పాత్రలోనే కనిపించింది. 

పూజ హెగ్డే చుట్టే ‘రెట్రో’ కథ

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రెట్రో’. సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. కథానాయిక పూజా హెగ్డే రుక్మిణి పాత్రలో కనిపించింది. బలమైన భావోద్వేగాలతో నిండిన ఈ పాత్రను తన శక్తిమేరకు నిలబెట్టే ప్రయత్నం చేసిందీ బ్యూటీ. ఎందుకంటే నటించడానికి స్కోప్ లేని డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్‌లో కనిపించింది. ఆమె రోల్ లెంగ్త్ ఎక్కువగా ఉన్నా, సినిమాలో ఇంపాక్ట్ ఉండదు.

శ్రీవిష్ణు కథానాయకుడిగా దర్శకుడు కార్తీక్‌రాజు రూపొందించిన తాజాచిత్రం ‘సింగిల్’. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు సందడి చేయనున్నారు. కేతికశర్మ, ఇవానా కథానాయికలుగా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది. దీన్నిబట్టి చూస్తే.. సింగిల్‌గా ఉండే 

‘సింగిల్’తో వస్తున్న ఇద్దరు ముద్దుగుమ్మలు 

శ్రీవిష్ణు కథానాయకుడిగా దర్శకుడు కార్తీక్‌రాజు రూపొందించిన తాజాచిత్రం ‘సింగిల్’. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. కేతికశర్మ, ఇవానా కథానాయికలుగా నటిస్తున్నారు. కేతికశర్మ.. గ్లామర్‌తో కుర్రకారును ఉర్రూతలూగిస్తుంటుంది. మరీ ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో ఇప్పటిలాగే గ్లామర్ షో చేస్తుందా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించనుందా చూడాలి.

రౌడీ హీరోతో రొమాన్స్ చేసే ‘భాగ్య’ం 

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న ‘కింగ్‌డమ్’ చిత్రం మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిగా నటిస్తోంది. రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’లో జతకట్టి తెలుగు తెరకు పరిచయమైన భాగ్యశ్రీ ఇప్పుడు రౌడీ హీరోతో రొమాన్స్‌కు సిద్ధమైంది.   

‘ఏస్’ అంటూ మురిపించనున్న రుక్మిణీ వసంత్ 

బోలెడు సినిమాలతో బిజీగా ఉంది రుక్మిణీ వసంత్. ప్రస్తుతం పలువురు స్టార్ హీరోల చిత్రాలకు సంబంధించి షూ టింగుల్లో పాల్గొంటున్న ఈ బ్యూటీ మే మూడోవారం లో తెరపై సందడి చేయనుంది. విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న ‘ఏస్’ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. అరుముగకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇదొక కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్. చాలా రోజుల క్రితమే షూటిం గ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని మే 23న విడుదల చేయనున్నారు. 

ప్రేక్షకులను సినిమాతో కనెక్ట్ చేసేది కథానాయికే..

కథను ముందుకు నడిపించడంలో హీరోయిన్ పాత్ర ఎక్కువగా సహాయపడుతుం ది. అంతేకాదు ఆమె నటన సినిమాకు ఒక ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. ఒక సినిమా సక్సెస్ కావడానికి నాయకా నాయికలిద్దరూ సమానంగా పనిచేయాలి. అప్పుడే సన్నివేశాలు రక్తి కడతాయి. అలా ఒక పాత్ర ద్వారా సినిమాతో ప్రేక్షకులు మరింతగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రేక్షకుడి నాడిని పట్టుకోవడం టాలీవుడ్ మేకర్స్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే తెలుగు సినిమాల్లో కథానాయిక పాత్ర చాలా ముఖ్యమని భావిస్తారు.

హీరోయిన్ పాత్ర కథను ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె పాత్ర ద్వారా కథలో కొత్త మలుపులు వస్తాయి. ప్రేక్షకులు కథను మరింతగా ఆసక్తితో చూస్తారు. హీరో, హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ సినిమా సక్సెస్‌కు చాలా ముఖ్యం.  హీరోయిన్ నటన, సినిమాలో ఆమె పాత్ర చాలా ముఖ్యం. తెలుగు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు గతంలో కొంతవరకు పరిమితంగా ఉండేవి. కానీ ఇప్పుడు కథానాయికల పాత్రలు మరింతగా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.