03-05-2025 11:47:17 PM
భారత ఆర్మీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
భారత్‌లో ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నిలిపివేత..
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిపై పాక్‌కు మద్దతుగా పోస్టులు పెడుతున్న ఆ దేశ సెలబ్రెటీలపై భారత్ దూకుడుగా వ్యవహరిస్తోంది. సామాజిక మాధ్యమం వేదికగా భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారి అకౌంట్లను మన దేశంలో నిలిపివేస్తూ కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజాగా పాకిస్థానీ సింగర్, వోకలిస్ట్ అబిదా పర్వీన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను భారత్ బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది. పహల్గాం దాడిపై తన అకౌంట్‌లో ఇష్టమొచ్చినట్టుగా రాసుకొచ్చిందని.. ఆమె వ్యాఖ్యలు భారత ఆర్మీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఖాతాను భారత్‌లో నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే పాకిస్థాన్‌కు చెందిన సెలెబ్రెటీలు హనిమా అమీర్, మహిరా ఖాన్, అలీ జాఫర్, ఫవద్ ఖాన్ అకౌంట్లపై భారత్‌లో నిషేధం పడిన సంగతి తెలిసిందే.