08-11-2025 01:15:53 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 7 (విజయక్రాంతి) : టీమిండియా మాజీ స్టార్ క్రికెట ర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ భారీ షాకిచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వారిద్దరిపై చర్యలు తీసుకుంది. ఈ ఉదంతంపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్పందించారు.
వీళ్లేం సెలబ్రిటీలు అంటూ ఆయన మండిపడ్డారు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ, అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? అని నిలదీశారు. సమాజానికి మేలు చేయాల్సిన సెలబ్రిటీలు, యువతకు ఆదర్శంగా నిలవాల్సిన వాళ్లు వారిని తప్పుదోవ పట్టించి ప్రాణాలు తీయకూడదని సజ్జనార్ హితవు పలికారు. గతంలో ఆయన బెట్టింగ్ యాప్‌లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసిన విషయం విదితమే.