calender_icon.png 7 November, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో వందేమాతరం గీతాలపన

07-11-2025 06:55:39 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్  మున్సిపల్ ఆవరణలో శుక్రవారం వందేమాతరం గీతాలాపన నిర్వహించారు. ఈ సందర్భంగా  జరిగిన వందేమాతరం గీతాలపన కార్యక్రమం గురించి కమిషనర్ రమేష్ మాట్లాడుతూ... ఇది భారతీయులందరినీ ఐక్యమత్యం చేయడానికి రచించిన గేయంప్రజలకు ఈ గేయం స్వాతంత్ర ఆకాంక్షను రగిలించిందని అభివర్ణించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల అనుసారం ఈరోజు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మున్సిపల్ ఆవరణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్, అధికారులు,  ఏఎన్ఎమ్స్,  ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.