calender_icon.png 16 September, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నారాయణ’ విద్యార్థుల మరో ఘనత

16-09-2025 01:15:03 AM

జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 3 బంగారు పతకాలు కైవసం

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): భారత రెజ్లింగ్ సమాఖ్య ఆ ధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక జాతీయ గ్రాప్లింగ్ (రెజ్లింగ్) ఛాంపియన్షిప్ నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు 3 బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయిలో సత్తాచాటారు. ఆయుష్ ఠాకూర్, వైష్ణవి ఠాకూర్ తమ నైపుణ్యం, కృషి, పట్టుదలతో జాతీయస్థాయిలో తమ విజయకేతనా న్ని ఎగురవేశారు.

ఆయుష్ ఠాకూర్ యు- విభాగంలో పోటీ పడి రెండు బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఒకటి జీఐ విభాగంలో (కిమోనో వంటి ప్రత్యేక డ్రస్‌తో ఆడే శైలి), మరొకటి నోజీఐ విభాగంలో (నేరుగా పట్టీలు, మార్పులతో జరిగే శైలి), వైష్ణవి ఠాకూర్, యు-15 విభాగంలో జీఐ ఈవెంట్లో బంగారు పతకం సాధించారు. ఈ విజయాలు విద్యార్థు ల పట్టుదలనే కాకుండా నారాయణ విద్యాసంస్థల సమగ్ర సహకారానికి ప్రతీకగా నిలుస్తు న్నాయి.

ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డా. పి. సింధూర నారాయణ మాట్లాడుతూ ‘పట్టుదల, సరైన మార్గదర్శకత్వం, అవకాశాలు కలిసి వచ్చినప్పుడు యువ ప్రతిభావంతులు ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొనగలరు. వైష్ణవి, ఆయుష్ విజయాలు మనకు వాటినే గుర్తు చేస్తున్నాయన్నారు.

వారి విజయం సహ విద్యార్థులకు ప్రేరణగా నిలిచే కాకుండా, నారాయణ నాలుగు దశాబ్దాలుగా పాటిస్తున్న విలువలు, శ్రేష్ఠతకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ శరణి నారాయణ మాట్లాడుతూ.. “ఆయుష్ ఠాకూర్, వైష్ణవి ఠాకూర్ సాధించిన ఘన విజయాలను గౌరవిస్తూ నారాయణ పాఠశాలలు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు.