16-09-2025 01:16:43 AM
మేడిపల్లి, సెప్టెంబర్15 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని కట్కూరి ప్రణీత్ నందన్ అనే 8 ఏళ్ల బాలుడు రాష్ర్టస్థాయి తైక్వాండో ఛాంపియన్ షిప్‌లో పాల్గొని కాంస్య పథకం సాధించాడు.
బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని పల్లవి మోడల్ స్కూలు 3 వ తరగతి చదువుతున్న ప్రణీత్ నందన్ ఈనెల 12, 14 తేదీలలో జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన రాష్ర్టస్థాయి ఛాంపియన్ షిప్‌లో మేడ్చ ల్ మల్కాజ్గిరి జిల్లా తరఫున పాల్గొని, 3 తెలంగాణ ఇంటర్ డిస్టిక్ తైక్వాండో చాంపియన్షిప్ 2025 సబ్ జూనియర్ బాయ్స్ (25)కిలోల కేటగిరిలో ప్రణీత్ కాంస్య పత కం సాధించాడు.
గత ఏడాదికాలంగా ఒలంపిక్ క్రీడ అయినా తైక్వాండో కో పితాని చైతన్య దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రణీ త్ నందన్ గతంలో కూడా మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లా స్థాయిలో పాల్గొని స్వర్ణం, రజిత పథకాలు సాధించాడు.