10-08-2025 12:06:15 AM
- కురిల్ దీవుల్లో ప్రకంపనలు
- రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదు
- ఐదు రోజుల కిందటే 6.8 తీవ్రతతో కంపించిన భూమి
మాస్కో, ఆగస్టు 9: రష్యాలోని కురిల్ దీ వుల్లో శనివారం 6.4 తీవ్రతతో భూమి కం పించినట్టు యురోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ పేర్కొంది. ఈ దీవు ల్లో ఆగస్టు 3నే 6.8 తీవ్రతతో భూమి కంపించింది. రోజుల వ్యవధిలోనే భూమి కంపిం చడం గమనార్హం.
గత నెలలో 8.8 తీ వ్రత తో కమ్చాటక్ ద్వీపకల్పంలో సంభవించిన భూకంప కేంద్రానికి ఈ ప్రాంతం దగ్గరే ఉం ది. ఆగస్టు 3న ఇదే దీవుల్లో 6.8 తీవ్రత తో భూమి కంపించగా.. అప్పుడు సునామీ హె చ్చరికలు కూడా జారీ చేశారు. జూలై 30 న సంభవించిన భూకంపం ప్రపంచంలోనే ఆ రో అతిపెద్ద భూకంపం. ఇటీవలి దశాబ్ది కా లంలో ఇంత భయంకరమైన భూకంపం సంభవించలేదు. 8.8 తీవ్రతతో భూమి కం పించినపుడు సునామీ కూడా సంభవించింది.