calender_icon.png 5 December, 2024 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ

23-09-2024 12:25:00 AM

ఒకరి దుర్మరణం

మహబూబాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ఆగి ఉన్న లారీ ని మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఎల్లంపేట స్టేజీ వద్ద మహారాష్ట్రకు చెందిన లారీ రోడ్డు పక్కన ఆపి ఉం డగా.. మరో లారీ వేగంగా వచ్చి వె నుక నుంచి ఢీకొట్టడంతో లారీ ను జ్జునుజ్జయింది. డ్రైవర్ రాంబాబు (40) అక్కడికక్కడే మృతిచెందాడు. రోడ్డు పక్కన్న ఆపి ఉంచిన లారీ డ్రై వర్ బాలా సాహెబ్ ఫిర్యాదు మే రకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.