17-09-2025 06:54:19 PM
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
కోదాడ: స్వస్త్ నారీ సశక్ట్ పరివార్ అభియాన్ (ఆరోగ్య మహిళ, శక్తివంతమైన కుటుంబం) కార్యక్రమాన్ని కోదాడ ప్రభుత్వ హాస్పిటల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని ఆరోగ్య కేంద్రాల యందు ప్రత్యేక మహిళా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి,ప్రత్యేక వైద్య నిపుణులచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడతాయన్నారు. వైద్యశిబిరాల్లో నేత్ర, దంత, చర్మ, చెవి, ముక్కు, గొంతు, ప్రసూతి, దెర్మటాలజీ, సైక్రియాట్రిస్ట్ వైద్య నిపుణులు పాల్గొని సేవలందిస్తారని బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీ, హిమోగ్లోబిన్, నేత్ర, గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. అవసరమైన మందులను అక్కడికక్కడే అందజేస్తారని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారi.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, డిసిహెచ్ఎస్ వెంకటేశ్వర్లు, ఏరియా హాస్పిటల్ సూపరిటీడెంట్ దశరద,డిప్యుటీ డిఎంహెచ్ఓ జయమనోహరి, జనరల్ మెడిసిన్ డాక్టర్ మాధవ్ కుమార్,ఇమ్యూనైజేషన్ డాక్టర్ లక్ష్మణ్, ఈ ఎన్ టి డాక్టర్లు నరసింహ, రాజేష్,అప్తమాలజీ డాక్టర్ నాగమణి, సైకీయాట్రిక్ డాక్టర్ స్రవంతి, జనరల్ సర్జెన్ డాక్టర్ వైష్ణవి, పల్మనాలజిస్ట్ డాక్టర్ వెంకట పాపిరెడ్డి, ఆయుష్ డాక్టర్ ఫారహిన్, కిశోర బాలికల డాక్టర్ శైలజ, ఓ బి జి డిపార్ట్మెంట్ డాక్టర్ పద్మావతి,ఆరోగ్య మిత్ర తిరపతమ్మ,అధికారులు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమానికి హాజరైనారు.