calender_icon.png 17 September, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడీ జన్మదినం సందర్భంగా రక్తదానం

17-09-2025 06:50:55 PM

నల్గొండ టౌన్, (విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర  మోడీ  జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగం రక్తదానం చేయగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ సందర్భంగా వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ  ప్రధాని మోడీ  భారతదేశ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని సబ్కా సాథ్ – సబ్కా వికాస్ అనే నినాదంతో దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేదల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు అవకాశాలు, కృషి చేసి  ప్రతి రంగంలో అపూర్వమైన మార్పులు తీసుకొచ్చారని తెలిపారు.