calender_icon.png 16 August, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీకి మరో షాక్!

02-01-2025 12:00:00 AM

పాలనాపరంగా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనక రాజకీయ కారణాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అదానీ గ్రూపు ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు విద్యుత్ ఒప్పందాలను దక్కించుకోవడానికి ఆ సంస్థ దేశంలోని అనేక రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులకు భారీమొత్తంలో లంచాలు ఇచ్చిందనేది ప్రధాన ఆరోపణ.

ముడు పులు అందుకున్న వారిలో ఏపీ మాజీ సీఎం జగన్‌తో పాటుగా తమిళనాడు సీఎం స్టాలిన్, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లాంటి వాళ్లు ఉన్నట్లు ఆ సమయంలో వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ తో పాటుగా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి.

డీఎంకే కూడా ఈ కూటమిలో ఉంది. ఈ నేపథ్యంలో తనపై వ చ్చిన ఆరోపణలకు స్టాలిన్ అసెంబ్లీ వేదికగా వివరణ ఇచ్చారు. తాను అ దానీని ఎప్పుడూ కలవలేదని ఆయన స్పష్టం చేశారు. సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ‘సెకీ’ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనే  ఒప్పం దాలు చేసుకున్నామని స్టాలిన్ తేల్చి చెప్పారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు అదానీ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ద్వారా అవినీతి మరక లేకుండా చేసుకున్నట్లయింది. కాగా తమిళనాడు చర్య ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న అదానీగ్రూపునకు మరో దెబ్బ అని చెప్పవచ్చు.