calender_icon.png 16 August, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకన్నను దయచేసే లక్మమ్మ

02-01-2025 12:00:00 AM

గోపికలకు శ్రీకృష్ణుని మేల్కొల్పి ఆయన దర్శనానుభవ సుఖాన్ని ఆనందించాలన్న ఆశ తీరలేదు. ఆయన మేల్కొనలేదు. బలరాముడు లేచినా శ్రీకృష్ణుడు మేల్కొనలేదు. కనుక, నీలాదేవిని ఆశ్రయించాలని గోపికలు గమనించారు. అమ్మవారిని ఆశ్రయించకుండా అయ్యవారిని ఆశ్రయించే దశ పూర్తికాదు. అమ్మగారు పురుషకారం.

మధ్యవర్తి. జీవుల పక్షాన నిలబడి, వారికోసం భర్తకు సిఫారసు చేసే దయామయి. కనుక నీలాదేవినే ముందుగా మేల్కొల్పవలసిందని అనుకుని ఆమెను ఆశ్రయిం చాలని గోపికలు తెలుసుకున్నారని శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు వివరించారు. ఆమె భవనం సమీపించారు. 

ఉందు మదకళిత్తన్= మదం స్రవించే ఏనుగులు బోలెడు తన మందల్లో కలవాడు, ఓడా ద తోళ్ వలియన్= ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజబలం కలవాడు, అంతటి, నంద గోపాలన్= నందగోపాలుని మరుమగళే!= కోడలా, నప్పిన్నాయ్= సమగ్ర సౌందర్యరాశీ, నీలాదేవీ అంటూ పిలిచారు. సీతా దేవి దశరథుడి కోడలిగానే పరిచయం చేసుకుంటుంది. నీళాదేవిని నందగోపాలుని కోడలిగానే పరిచయం చేస్తున్నారు గోపికలు.

కందం కమరుం కురలి= సహజమైన పరిమళం ఉన్న కేశపాశం కలదానా! (మనం చేసిన పాపాలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది, ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ), కడై తిఱవాయ్= గడియ తెరువుమా, కోరి అరైత్తన కాణ్= కోడి కూస్తుంది, కోడి జాము జాముకి కూస్తుంది, ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీళాదేవి. దమ్మా ఎంగుం= అన్ని కోళ్ళు కూస్తున్నాయి, వంద్= తిరుగుతూ కూస్తున్నాయి.

ఇవి జాము కోడి అరుపు కాదు అని చెప్పింది. సాధారణంగా జ్ఞానులను కోడితో, పక్షులతో పోలుస్తుంటారు. నీలాదేవి అందంగా పాడగలదట, కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి. మాదవి ప్పందల్ మేల్= మాధవీలత ప్రాకిన పందిరి మీద, పల్గాల్= అనేకసార్లు, కుయిల్ ఇనంగళ్= కోకిలల గుంపులు, కూవిన కాణ్= కూస్తు న్నాయి. రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారు.

పందార్ విరలి= బంతి చేతు లలో కలదానా. ఈ భూమివంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు. అలాంటి అండాలనన్నీ కలిపితే అది బ్రహ్మాం డం. అటువంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు, ఆమె నాయిక. ఉన్ మ్ము త్తునన్ పేర్ పాడ= నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపజేసేట్టు పాడుతాం.

శెందామరై క్కైయా ల్= నీ దివ్యమైన తామరల వలె ఉన్న సుందరమైన హస్తాలతో, శీరార్ వళై ఒలిప్ప= నీ ఆ అందమైన గాజుల సవ్వడి మాకు సోకుతుండగా, మగిరింద్= అమ్మా నీ పిల్లలం మేమం తా అనే ప్రేమతో, ఆనందంతో, వందు తిఱవాయ్= నీవు లేచి మాదాక వచ్చి తలుపు తెర వాలి అంటూ నీలాదేవిని అమ్మ నిద్ర లేపింది అని జీయర్ స్వామి వివరించారు. నందగోపుడంటే ఆచార్యుడు.

గజము భగవానుడికి ప్రతీ క. గజాన్ని వశంలో ఉంచుకునే శక్తి కలిగిన నం దగోపుడే ఆచార్యుడు. అతని వ్రేపల్లెయే ఆచా ర్య కులము. గడియ తీయటమంటే అమ్మ కర్మానుసారంగా కాకుండా కృపానుసారంగా దయతలచి పరమాత్మ రక్షణకు అభయం ఇవ్వడం. నందగోపుడు మహాబలవంతుడు. ఏనుగులతో పోరాడగలిగిన వాడు. మదము స్రవిస్తున్న ఏనుగు బలం కలవాడు, మదం స్రవిస్తున్న ఏనుగులున్న వాడు.

యుద్ధంలో జంకడు. అంతటి నందగోపుని కోడలివి నీవు. నీలాదేవీ నీ నీలవేణి సుగంధాలు వెదజల్లుతున్నాయి. కోళ్లు అన్నీ కూస్తున్నాయి. తెల్లవారిం ది. మాధవీ లత అల్లుకున్న పందిరిమీద కోకిలలు గుంపులుగా కూచున్నాయి. నీ చేతిలో బంతి ఉంది, మేం వచ్చి నీ బావ గుణకీర్తనం చేస్తున్నాం. ఆనందంగా మందస్మిత వదనంతో రామ్మా, నీ సుందరమైన చేతి కంకణాలు ఘల్లుమని ధ్వనిస్తుంటే తలుపు తెరువు.