calender_icon.png 30 July, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో మరో తెలుగు యువతి మృతి

22-07-2024 01:24:09 PM

అమెరికా - యూనివర్శిటీ ఆఫ్ సెంట్రల్ ఓక్లహోమాలో ఎంఎస్ చదువుతున్న హారిక వయస్సు (24) అనే యువతి నిన్న యూనివర్సిటీ నుంచి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు ఓ బైకర్ పడిపోవడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న 3 కార్లు హారిక వాహనాన్ని బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందగా.. మిగతా వారికి గాయాలయ్యాయి. మృతురాలు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన హారికగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.