calender_icon.png 12 May, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపాలి:ఎస్పీ

09-05-2025 12:41:16 AM

ఆదిలాబాద్, మే8(విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపా లు జరగకుండా చూడాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ త్వరితగతన న్యా యం చేసే విధంగా సిబ్బందిని కేటాయించాలన్నారు.

పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలు వాటి పురోగతి దర్యాప్తు పై విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఆవరణ పరి శీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని దీర్ఘ కాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు ను పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేయాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తూ ప్రమాదాలను నివారించా లని ఆదేశించారు. కార్యక్రమంలో ఉట్నూరు ఎఎస్పీ కాజల్ సింగ్, సీఐ మొగిలి, ఎస్సై మనోహర్, సిబ్బంది పాల్గొన్నారు.