calender_icon.png 22 November, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధారాలేవీ?

22-11-2025 01:15:53 AM

  1. పారిశ్రామిక పాలసీపై కేటీఆర్ ఆరోపణలు పచ్చి అబద్ధాలు
  2. కన్వర్షన్ ఇంపాక్ట్ ఫీజును స్కాంగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం
  3. 9,292 ఎకరాల్లో పరిశ్రమలకు కేటాయించింది 4,740 ఎకరాలే
  4. బీఆర్‌ఎస్ హయాంలో ఎన్ని లక్షల కోట్లు వసూలు చేసుకున్నారో?
  5. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ టాన్స్‌ఫర్మేషన్ పాలసీ(హెచ్‌ఐఎల్‌టీపీ)పై బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాల ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. పారిశ్రామిక భూముల కన్వర్షన్ కోసం ఇంపాక్ట్ ఫీజు వసూలుచేయాలని నిర్ణయిస్తే దాని ని రూ. 5--6 లక్షల కోట్ల కుంభకోణంగా చిత్రీకరిస్తూ కేటీఆర్ దుష్ర్పచారం సాగిస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం పరిశ్ర మలకు లీజుకిచ్చిన భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ‘ఫ్రీహోల్డ్’ రైట్స్ పేరిట 2023 ఆగస్టులో మూడు జీఓలు ఇచ్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో కాదా అని ఆయన ప్రశ్నించా రు. శుక్రవారం సచివాలయంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఆరోపణలను మంత్రి శ్రీధర్‌బాబు తిప్పికొట్టారు.

కేటీఆర్ చెబుతున్న 9,292 ఎకరాల భూమిలో పరిశ్రమలకు ప్లాటిం గ్ చేసి కేటాయించినది 4,740 ఎకరాలేనని, మిగిలిన భూమి రోడ్లు, డ్రెయినేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించినట్టు తెలిపారు. ఈ కేటాయింపులు ఒక్కరోజులో చేసినవి కాదని, పరిశ్రమల అభివృద్ధి కోసం దశాబ్దాల కాలంగా ఇస్తూ వచ్చినవన్నారు. కేటీఆర్ తన వద్ద ఉన్న ఆధారాలేవైనా బయటపెడితే ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందన్నారు. 

ఆజామాబాద్, కూకట్ పల్లి, హఫీజ్ పేటల్లోని పరిశ్రమల భూములను ఫ్రీ హోల్డ్ పేరిట యాజమాన్య హక్కులు కల్పించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని గుర్తుచేశారు. ఈ భూములకు సంబంధించి ఇండస్ట్రీస్, కామర్స్ శాఖ జీఓఎంస్ 19, 20, 21 లను 2023 ఆగస్టు 29న జారీచేసిందని వివరించారు. ఇప్పుడు ఆ భూములకు కన్వర్షన్ అవకాశం కల్పిస్తున్నామని, 30 శాతం, 50 శాతం స్లాబులతో ఇంపాక్టు ఫీజు నిర్ణయిస్తూ ఈనెల 17 న జరిగిన క్యాబినెట్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

2023లో ఎన్నికలకు ౪ నెలల ముందు ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించారని, ఆ సమయంలో ఎన్ని లక్షల కోట్లు వసూలు చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములకు సంబంధించి గత పాలకులు ఒక గ్రిడ్ పాలసీ తీసుకొచ్చారని, వారు అప్పుడు చేసిన పనులన్నీ బయటకు తీయాల్సి ఉందన్నారు. ఆ జీఓల విషయం దాచిపెట్టి ప్రభుత్వంపై నిరాధార నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇండస్ట్రీయల్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అవాస్తవాలు కేటీఆర్ చెప్పారని తెలిపారు. కేటీఆర్ చెప్పే 30 శా తం ఫీజు భూమి విలువలో కాదని, కేవలం కన్వర్శన్ ఫీజు మాత్రమే అని స్పష్టం చేశారు. కానీ ఫ్రీ హోల్డ్ భూములకుకు, లీజు భూములకు సంబంధం లేకుండా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కేటీఆర్ వ్యా ఖ్యలు అడ్డగోలుగా ఉన్నాయని, సత్యదూరమైన మాటలు కేవలం కేటీఆర్‌కే సొంతమని విమర్శించారు. కన్వర్శన్‌కు, భూ మికి లింక్ పెట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా బీఆర్‌ఎస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, ఇకనైనా గాలి మాటలు మానుకోవాలని హితవు పలికారు. 

ఆధారాలుంటే బయటపెట్టండి..

సీఎం సోదరులు అగ్రిమెంట్లు చేసుకున్నారని నోటికొచ్చినట్లు మాట్లాడారని, వారె వరూ ప్రభుత్వంలో లేరని పేర్కొన్నారు. ప దేండ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా అభూత కల్పనలు ప్రచారం చేయడం దుర్మార్గమని అన్నారు. ఆధారాలేవైనా బ యటపెడితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ ఆలోచ నల్లో మార్పు రావాలని కోరుకున్నారు. అందరూ దరఖాస్తు చేసుకుంటే కన్వర్షన్ ఇంపాక్ట్ ఛార్జీల వల్ల రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నామని స్పష్టం చేశారు.

యాజమాన్య హక్కులు లేనివారు కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకోలేరని చెప్పారు. ఆర్థిక ఆరాచకత్వానికి పాల్పడి వెళ్లి పోతే, రెండేళ్లుగా దానిని సరిదిద్దుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా మని వెల్లడించారు. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను వెలుపలకు తరలిస్తామని మొదటి నుంచి చెబుతున్నామని, గాలి, నీరు కాలుష్యం లేకుండా చేయడానికి పరిశ్రమలను బయటకు తరలిస్తున్నామని పేర్కొ న్నారు.

పరిశ్రమలను ఆకర్షించడానికి కొన్ని రాష్ట్రాలు ఎకరం భూమిని 99 పైసలకే కేటాయించడం చూస్తున్నామని, విద్యుత్తు, పన్ను రాయితీలను 20 ఏళ్ల పాటు ఇస్తున్నారని గుర్తు చేశారు. మన దగ్గర భూముల విలువ ఎక్కువ, లభ్యత కూడా తక్కువ.. అయినప్పటికీ పరిశ్రమలకు అనుకూలమైన ఎకో సి స్టం ఉండాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, రాష్ర్టం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

రాష్ర్ట ఆదాయాన్ని పెంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు గండికొట్టాలని చూడటమే బీఆర్‌ఎస్ ప్రధాన లక్ష్యంగా మారిం దని విమర్శించారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు పాటుపడుతున్నామని, ప్రతిపక్షంగా సహకరించక పోయి నా ఫర్వాలేదు.. కానీ అబద్ధాలతో రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు చేయొ ద్దని సూచించారు. బెదిరింపు ధోరణులు మానుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు హితవు పలికారు. 

కేటీఆర్‌కు పట్ట పగలే చుక్కలు

జూబ్లీహిల్స్ ఎన్నికల ఓటమితో కేటీఆర్‌కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయని ఎద్దే వా చేశారు. వారి పార్టీ ప్రసార సాధనాలు ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తున్నట్టు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసాయని, ఇప్పుడు వారి పత్రికలే లేని దానిని కుంభకోణంగా అభివర్ణిస్తే నమ్మే పరిస్థితి లేదన్నారు. అసలు కుంభకోణమో, స్కామో జరిగితే అది బీఆర్‌ఎస్ హయాంలోనే అయి ఉంటుందని ఆరోపించారు.

పరి శ్రమల యజమానులు హక్కులు పొందాలంటే రిజిస్ట్రేషన్ విలువపై 100 శాతం చెల్లించాలని, అవి చేతులు మారితే 200 శాతం కట్టాలని జీఓలు ఇచ్చారని గుర్తుచేశారు. ఆ భూములు మరొకరి పరమైతే హ క్కులు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. వారిచ్చిన యాజమాన్య హక్కులు ఉన్నవారికి భూ వినియోగ మార్పిడి చేసుకునే అవకాశం మాత్రమే మేం కల్పించామని వివ రించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల కమిషనర్లు పరిశ్రమల సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదట 30 శాతం, 50 శాతం స్లాబులను ప్రతిపాదించినట్టు తెలిపారు.