22-11-2025 12:50:53 AM
ఉన్నది దాచిపెడతారు.. లేనిది ప్రచారం చేస్తారు
ఆ మున్సిపాలిటీ తీరే వేరు..
కమిషనర్ అనుకూలమైన వ్యక్తికే బలమైన పగ్గాలు
ససేమిరా అంటే ఇక అంతే సంగతులు.. చెప్పింది చేయాలి
కిందిస్థాయి అధికారికి ఉన్నత స్థాయి బాధ్యతలు
పనిచేసే వారు తక్కువగా ఉన్నారు : లక్ష్మారెడ్డి, కమిషనర్, జడ్చర్ల మున్సిపాలిటీ, మహబూబ్ నగర్
జడ్చర్ల, నవంబర్ 21: పెద్దలకు మర్యాద ఇవ్వాలి...వారి ముందు చూసి నడవాలి.. ఇది మనం చెబుతున్న మాట కాదు నాటి పురాతన కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు మన పెద్దలు చెబుతూ వస్తున్న మాట. ఇది నిజం అని కూడా మన అందరికీ విధితమే. పెద్దలు చేయవలసిన విధి నిర్వహణలో ఆ బాధ్యతలు దూరంగా ఉండవలసిన కిందిస్థాయి అధికారులు పై స్థాయి అధికారి అధికారులను ఉపయోగించి విధులు నిర్వహిస్తే ఆ పై స్థాయి అధికారికి పని ఏముంటుంది.
బాధ్యతలు అప్పగించి చూస్తేనే వారికి ఉన్న బాధ్యత ఇంతవరకు నిర్వర్తిస్తారు ఉన్నత స్థాయి అధికారి కూడా తెలుస్తుంది. అవేం పట్టకుండా ఎవరో ఒకరు చేస్తున్నారు కాలం గడుస్తుంది అంత బాగున్నాం అనుకుంటే ఎట్లా అంటూ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది జరుపుకుంటున్న చర్చ తీవ్ర రూపం దాల్చుతుంది.
ఇలా జరిగిందంట..
జడ్చర్ల మున్సిపాలిటీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కీలకమైనది. ఈ మున్సిపాలిటీకి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. రెండు దశాబ్దాల కాలం కూడా ఇంకా పూర్తి చేసుకోలేని మున్సిపల్ పాలకవర్గం లో అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రజలంతా ఆశపడుతుండ్రు. ఇదే అదునుగా చూసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారి ఇష్టం సారంగ వివరిస్తున్నారని మున్సిపల్ ప్రజలు చెబుతున్న మాట.
గత ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వీఆర్వోలను నిర్వీర్యం చేస్తూ వివిధ శాఖలకు కేటాయించిన విషయం విధితమే. ఇక్కడినుంచి వచ్చిన ఓ విఆర్ ఓ జూనియర్ అసిస్టెంట్ గా జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో చేరారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సందర్భంలోనే సీనియర్ అసిస్టెంట్గా పద్ధతి లభించింది. ఈ పదిన్నది లభించడంతో నాగర్ కర్నూల్ మున్సిపల్ కార్యాలయానికి బదిలీ అయ్యారు.
ఇక్కడ ఉన్న పెద్ద సారు ఆ అధికారి మాకు కావాలి అంటూ జాయింట్ డైరెక్టర్ కు ప్రత్యేక లేఖ రాసి ఇక్కడే ఉండేటట్లు చేసుకున్న సందర్భం వెలుగులోకి వచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా మేనేజర్ విధులు కూడా సీనియర్ అసిస్టెంట్ నిర్వహించడమేంటంటూ కార్యాలయ సిబ్బందితో పాటు ప్రజల సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ముగింపు పలుకుతూ అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక్కడి అధికారులు అక్కడ..
జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించవలసిన కీలక హోదాల్లో ఉన్న ముగ్గురు అధికారులు వివిధ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్లుగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి. జడ్చర్లలో విధులు నిర్వహించిన ఇంచాల్సిన మేనేజర్ నూరుల్ నజీబ్ డిప్యూటేషన్ లో భూత్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తుండగా, ఆర్‌ఓ శశిధర్ డిప్యూటేషన్ విధానంలో ఆత్మకూరు మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గా, సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించాల్సిన మరొక అధికారి నీ డిప్యూటేషన్ లోనే బడంగ్‌పేట్ మునిసిపల్ కార్పొరేషన్ విధులు నిర్వహిస్తున్నారు.
గద్వాల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి డిప్యూటేషన్ లో ఓ అధికారి జడ్చర్ల మున్సిపాలిటీలో మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో విధులు నిర్వహించిన సీనియర్ అసిస్టెంట్ జడ్చర్లలో సీనియర్ అసిస్టెంట్ తో పాటు ఆర్‌ఓ, మేనేజర్ బాధ్యతలు కూడా నిర్వహించడం విడ్డూరంగా ఉందని పలువురు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.
పట్టణమంతా ఒకటే చర్చ..
అసలు ప్రభుత్వ అధికారి అంటే ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు వారి పని వారికి సమర్థవంతంగా అప్పగించాలి. ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహిస్తే ఇటువంటి కథనాలు ఎందుకు వస్తాయని జడ్చర్ల మున్సిపాలిటీ పై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ తీవ్రంగా జరిగింది. పై స్థాయి అధికారి ఉన్నప్పుడు కిందిస్థాయి అధికారి పై స్థాయి అధికారి పనులు కూడా చేస్తే ఆ పై స్థాయి అధికారికి అక్కడ ఆ సిబ్బంది దగ్గర ఎలా ఉంటుందో ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఏ స్థాయిలో ఉన్న అధికారులు ఆ స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తూ ముందుకు సాగితే కిందిస్థాయి అధికారులు వారి పరిధిలో వారు పనిచేస్తే ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రజలతోపాటు ఆయా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బంది కూడా క్రమశిక్షణతో అడుగులు వేసే అవకాశాలు ఉంటాయని లేనిెుడల అనవసరమైన అవరోధాలు తెచ్చిపెడతాయని జడ్చర్ల మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, పట్టణవాసులు చెబుతున్న మాట. నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగుతారని ప్రజలు ఆశిస్తున్నప్పటికీ ఆ కమీషనర్ ఆదిశగా చర్యలు తీసుకుంటారు లేదో చూడాలి.
సిబ్బంది తక్కువగా ఉన్నారు..
సిబ్బంది తక్కువగా ఉండడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ ఉన్న అధికారులు ఇతర ప్రాంతాల్లో డిప్టేషన్ విధానంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇతర కార్యాలయం నుంచి ఇక్కడ కూడా డిప్యూటేషన్ విధానంలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ మరింత సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఎక్కడ ఇలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో సమర్థవంతంగా ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎవరి బాధ్యతలను వారికి అప్పగించడం జరుగుతుంది. ఒక్కరికే బాధితులు అప్పగించడం అనేది మాకు ఏమీ లేదు. నిబంధన మేరకు ముందుకు సాగుతాం.
లక్ష్మారెడ్డి, కమిషనర్,
జడ్చర్ల మున్సిపాలిటీ, మహబూబ్‌నగర్ జిల్లా