22-11-2025 12:42:03 AM
నిర్మల్, నవంబర్ 21 (విజయక్రాంతి): ఐకేపీ మహిళా సంఘాలను కోటీశ్వరులను చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్న నిర్మల్ జిల్లాలో వడ్లు కొనుగోలు చేసిన మహిళా సంఘాలకు కమిషన్ డబ్బులు రావడం లేదు. పంట కొనుగోలు వ్యాపారంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభిస్తున్న కొనుగోలు చేసిన సంఘాలకు కమిషన్ డబ్బుల విడుదల కాకపోవడం ఈ సీజన్లో ఐకెపి మహిళా సంఘ సభ్యులు కొనుగోలపై నిరాశక్తితో కనిపిస్తున్నారు.
2023-24, 2024-25 సీజన్ సం బంధించిన కమిషన్ బకాయిలు నిర్మల్ జిల్లా లో రూ. 37.07 కోట్ల బకాయి పెండింగ్లో ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. నిర్మల్ జిల్లాలో వర్గాన్ని కొనుగోలు కేంద్రాల ను వివో సంఘాలకు ప్రభుత్వం ప్రత్యేక కేటాయిస్తోంది. కేంద్రాల్లో వరి ధాన్యం కొను గోలులో మహిళా సంఘాలకు క్వింటాలకు ప్రభుత్వం రూ.32 కమిషన్ ఖాతాలో ప్రభు త్వ పౌరసర్పల శాఖ జమ చేయవలసి ఉం టుంది.
అయితే నిర్మల్ జిల్లాలోని నిర్మల్ ముధోల్ ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఐకెపి ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నప్పటికీ కొనుగోలుకు సంబంధించిన కమిషన్ డబ్బు లు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నా యి. ఎండనక వాననక రాత్రింబవళ్లు కష్టపడి పంట కనుగోలను పూర్తిచేస్తే తమకు కమిషన్ డబ్బులు చెల్లించకపోవడంతో నిర్వాణ ఖర్చు లు సంఘమే భరిస్తున్నారు.
జిల్లాలో బకాయి రూ.44.30 కోట్లు
నిర్మల్ జిల్లాలో ఐకేపీ మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వం వర్గాలను కొంగులు కేంద్రాలను ఏర్పాటు చేయగా కమిషన్ పెండింగ్ బిల్లుల 44.30కోట్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. 2023 24 ఖరీఫ్ సీజన్లో 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,64,380.04 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన కమిషన్ 5.24 కోట్లు విడుదల చేయవలసి ఉండగా 3.61 కోట్లు విడుదల కాగా 1.57 కోట్లు పెం డింగ్ ఉన్నట్టు అధికారులు తెలిపారు.
యాసం గి 54 వివో సంఘాల ద్వారా సీజన్లో1.43, 349.20 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించారు. దీనికి సంబంధించిన కమిషన్ 7.74 కోట్ల రూపాయలు రావాల్సిండగా 5.41 కోట్ల రూపాయలు వచ్చాయి 2.32 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. 2024 25 ఖరీఫ్ సీజన్లో 65 గ్రామ సమైక్య సంఘాల ద్వారా 2,22, 941.02 మెట్రిక్ టన్నుల ధాన్యం స్వీకరించా రు, 7.13 కోట్ల బకాయి రావాల్సి ఉంది.
యాసంగిలో 132 గ్రామ సమైక్య సంఘాల ద్వారా 8,69,915.02 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 27.67 కోట్ల బకాయి రావాల్సి ఉంది. అంటే జిల్లాలో జిల్లాలో 44. 30 కోట్ల కమిషన్లు ప్రభుత్వం మహిళా సం ఘాల ఖాతాలో జమ చేయవలసి ఉంది. రెం డు సంవత్సరాలుగా ప్రభుత్వం క్వింటాలుకు మహిళా సంఘాలకు చెల్లించి 32 రూపాయల కమిషన్ డబ్బులు రాకపోవడంతో మహిళా సంఘాలు చెందుతున్నాయి.
ఈసారి నిరాశతోనే కొనుగోలు
గత రెండు సీజన్లకు సంబంధించిన కమిషన్ డబ్బులు ప్రభుత్వం వివో సంఘాలకు జమ చేయకపోవడంతో ఈ సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్లపై కొన్ని మహిళా సంఘాలు నిరాశక్తితో చూపిస్తున్నాయి. కమిషన్ డబ్బుల విషయంలో కొనుగోలు కేంద్రాల నిర్వహణ కమిటీ సమావేశంలోని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం నిధులు మంజూరు కాగానే ఖాతాలో జమ చేస్తా పని భరోసా ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు.
సమర్థవంతంగా కొనుగోలను నిర్వహిస్తున్న మహిళా సంఘాలకు మాత్రం కమిషన్ డబ్బులు రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మహిళా సంఘాలను ఆర్థికంగా బల పితం చేసి కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్న వ్యాపారం చేసిన మహిళా సంఘాలకు రెండు సీజన్లో కమిషన్ డబ్బులు విడుదల చేయకపోవడంపై వారు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మహిళా సంఘాలకు చెల్లించవలసిన కమిషన్ డబ్బులను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు
నిధులు విడుదలకాగానే ఖాతాల్లో జమ..
నిర్మల్ జిల్లాలో ఐకెపి మహిళా సంఘాలకు కమిషన్ డబ్బులు చెల్లించాలని ప్రభు త్వానికి నివేదిక ఇచ్చామని సివిల్ సప్లై నిర్మల్‌డిఎం సుధాకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఐకెపి మహిళా సంఘాలు వరి ధాన్యం కొనుగోలను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించడం వల్ల కమిషన్ డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ విషయమై ఉన్నతాధికల్లు దృష్టికి సైతం తీసుకెళ్లిన. త్వరలో డబ్బులను వారి ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైతులకు మేలు చేయాల సంకల్పంతోనే
నిర్మల్ జిల్లాలో ఐకెపి మహిళా సంఘాలకు వారి ధాన్యం కొనుగోలు సంబంధించిన కమిషన్ డబ్బులు రాకపోయినప్పటికీ రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నాం. జిల్లాలో ఐకెపి మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మద్దతు ధర లభిస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మహిళా సంఘాలు సమర్థవంతంగా కొనుగోలను నిర్వహిస్తున్నాయి త్వరలో డబ్బులు విడుదల అయ్యే అవకాశం ఉంది మహిళా సంఘ సభ్యులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
విజయలక్ష్మి, జిల్లా గ్రామీణ
అభివృద్ధి అధికారి నిర్మల్