22-11-2025 01:14:45 AM
కల్వకుర్తి టౌన్, నవంబర్ 21 : పట్టణంలోని ముదిరాజ్ భవనంలో శుక్రవారం ఘనంగా ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ మత్స్యకార శాఖకి ప్రభుత్వం మూడు వేల కోట్లను విడుదల చేయాలని, ఆర్థికంగా వెనుకబడిన ముదిరాజ్ కులస్తులను ఆదుకోవాలన్నారు. ముదిరాజులను బిసి డి నుండి బిసి ఏ లోకి మార్చాలని, ప్రతి సొసైటీకి చాప పిల్లలను అందించాలని, గౌడ్ అన్నలు, నేతన్నల మాదిరిగానే ముదిరాజులకు కూడా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మత్స్యకార సంఘం అధ్యక్షుడు కుంభం భీమయ్య, ఉపాధ్యక్షుడు శేఖర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, యువజన నేతలు కుంభం చందు ముదిరాజ్, వెంకటయ్య, తిరుపతి, సూరి, శ్రీనివా సులు, యాదగిరి, ప్రవీణ్, శ్రీను, గోపి, శ్రీకాంత్, వెంకటేష్, శ్రీధర్, భాస్కర్, బాలు, సాయి, తదితరులు పాల్గొన్నారు.
కొత్తకోట..
కొత్తకోట, నవంబర్ 21 : కొత్తకోట పట్టణంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మత్స్యకారులతో కలిసి కొత్తకోట పట్టణ అధ్యక్షులు చాపల భాస్కర్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కృష్ణయ్య, మందడి సురేష్, రాజకుమార్, గిరి, ముదిరాజ్ సంఘ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.