calender_icon.png 16 October, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్ట్ టైం టీచర్లకు భరోసా ఏదీ?

16-10-2025 12:23:38 AM

రాష్ర్టంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న పార్ట్ టైం ఉపాధ్యాయుల వేతనాలు తక్కువే అయినా గురుకులాల్లో అధిక బాధ్యతలను మోస్తున్నారు. గత పదిహేను సంవత్సరాలుగా శాశ్వత  అధ్యాపకులకు ఏమాత్రం తక్కువ కాకుండా సమానంగా పని చేస్తున్నా వారికిచ్చే గౌరవ వేతనం మాత్రం అంతంతే.

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ‘పార్ట్ టైం అధ్యాపకుల’ జీవన స్థితిగతులు ఆగమ్యగోచరంగా త యారయ్యాయి. రాష్ర్టంలోని నిరుపేద తెగలకు చెందిన గిరిజన విద్యార్థులకు నాణ్య మైన భోజనం, వసతితో పాటు పోటీ ప్ర పంచంలో ఉన్నతంగా రాణించేందుకు, ప్ర మాణ విద్యను అందించేందుకు ప్రభుత్వం ‘పార్ట్ టైం అధ్యాపకుల’ను అన్ని అర్హతల ను అనుసరిస్తూ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి, పటిష్టమైన నిర్దేశంతో ఆయా గురుకులాల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడం శుభపరిణా మం.

అలాగే శాశ్వత అధ్యాపకుల్లాగా ప్ర భుత్వ, ఆయా ఉన్నతాధికారుల నియమ నిబంధనలను పాటిస్తూ సక్రమమైన విధు లు నిర్వర్తిస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు శ్రమకు తగిన వేతనం లేక వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. ఇటీవ ల తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చిన పీ ఆర్సీ.. గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్ టైమ్ టీచర్లకు తప్ప మిగిలిన అన్ని సొసైటీ ఉద్యోగులకు జీవో నెం 16, 63 ఇప్పటివరకు అమలు కాకపోవడం గమనార్హం.

ప్ర భుత్వం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల సేవలను ఇప్పటికైనా గుర్తిస్తూ వేతనాల పెంపు, ఉ ద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఎం తైనా ఉంది. రెగ్యులర్ ఉపాధ్యాయుల వి ధులను తూచా తప్పకుండా సక్రమంగా అందిస్తున్నందున బేసిక్ పే వేతనాలను, పార్ట్ టైమ్ ఉద్యోగులకు వర్తింపజేయడం తో పాటు 30 శాతం పీఆర్సీని అందించాలి.

అధిక బాధ్యతలు

రాష్ర్టంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న పార్ట్ టైం ఉపాధ్యాయుల వేతనాలు తక్కువే అయినా గురుకులాల్లో అధిక బాధ్యతలను మోస్తున్నారు. గత పదిహేను సంవత్సరాలుగా శాశ్వత ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఏమాత్రం తక్కువ కాకుండా సమానంగా పని చేస్తున్నారు. రాష్ర్టంలోని వివిధ తెగల్లోని తండాలు, గూడాల్లోని నిరుపేద గిరి జన విద్యార్థుల బంగారు భవిష్యత్తును త మదైన శైలిలో  తీర్చిదిద్దుతూ, గురుకుల విద్యాలయాల సొసైటీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారనడంలో సందేహం లేదు.

పార్ట్ టైం పేరుతో సేవలందిస్తున్న అధ్యాపకులకు ప్రభుత్వం వేతనంగా కేవ లం రూ. 14 వేలు మాత్రమే అందిస్తోంది. దీంతో పార్ట్ టైం అధ్యాపకులు కుటుంబ పోషణ భారంగా మారిపోయింది. అరకొ ర సౌకర్యాలతో జీవన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. జిల్లా స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసి, రాత, మౌఖిక పరీక్షలు, డెమో క్లాస్ నిర్వహించి, అన్ని రకాల విద్యార్హతలను పరిశీలించిన అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో ద్వారా పార్ట్ టైమ్ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తున్నారు. ఇందులో చాలా మంది గురుకు లంలో విద్యను అభ్యసించిన నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు.

తాత్కాలిక ఉపాధ్యాయులు గురుకుల పాఠశాలలో ఉదయం 8 నుంచి మధ్యా హ్నం 1:30 వరకు తరగతులు, డైనింగ్ హాల్ డ్యూటీ, మద్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూపర్వైజర్ స్టడీ, సాయంత్రం 4 నుంచి 4:30 వరకు క్లబ్ కృత్యాల నిర్వహణ, సాయంత్రం 6:30 సప్పర్ డ్యూటీ,  రాత్రి 7:30 నుంచి 10 గంటల వరకు నైట్ స్టడీ సూపర్విజన్ తో పాటు హౌస్ మాస్టర్ డ్యూటీ, అనేక రకాల బాధ్యతలతో గొడ్డుచాకిరీ చేస్తున్నా వారికి దక్కుతున్న గౌరవం మాత్రం శూన్యం. పని సమయంలో కొందరు ప్ర ధానోపాధ్యాయులు దురుసుతనం ప్రదర్శించినా నోరు మెదపక సొసైటీ అభి వృద్ధి, విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ద్యేయం గా విధులు నిర్వర్తిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. 

నిరంతర శ్రమ దోపిడీ

గిరిజన గురుకులాల్లో పని చేస్తున్న అ ధ్యాపకులు పేరుకు పార్ట్ టైం అయిన వి ధులు మాత్రం ఫుల్ టైం నిర్వహిస్తూ 24 గంటలు గురుకులాలకే తమ అమూల్యమై న సేవలను అంకితం చేస్తున్నారు. పార్ట్ టై మ్ ఉపాధ్యాయులకు గురుకుల ఆవరణ లో క్వార్టర్స్ ఇవ్వకపోవడం వల్ల నైట్ డ్యూ టీ తర్వాత తమ ఇళ్లకు చేరే సందర్భంలో పలుమార్లు రోడ్డు ప్రమాదాలకు గురవు తూ, పలువురు ఉపాద్యాయులు ప్రాణా లు కోల్పోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి.

ఇక పార్ట్ టైం అధ్యాపకులుగా పనిచేస్తున్న మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పొరుగు సేవల ప్రా తిపదికన పనిచేసే అటెండర్, వాచ్‌మెన్ల వేత నాలతో పోలిస్తే పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల వేతనాలు తక్కువగా ఉండటంతో వారు నిరాశ భావానికి గురవుతున్నారు. పేరుకే పార్ట్ టైమ్ కానీ 24 గంటలు తమతో పని చేయించుకుంటూ సమయానికి జీతాలు ఇవ్వకుండా అధికారులు వాళ్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

ప్రభుత్వం పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల సేవలను రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమా నంగా ఉపయోగించుకొని, వేతన విషయంలో తీవ్రవివక్ష చూపిస్తూ, శ్రమ దోపి డీకి పాల్పడుతుంది. ఇతర గురుకుల సొసై టీ పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల వేతనాలతో పోల్చితే, గిరిజన గురుకుల పార్ట్ టైం ఉపాధ్యాయుల, అధ్యాపకుల వేతనాలు తక్కువ గా ఉన్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, పార్ట్ టైం అధ్యాపకులకు పనికి తగిన గౌరవ వేతనాలు అం దించాలి. 

ఉద్యోగ భద్రత ఎక్కడ?

ప్రభుత్వం పార్ట్ టైం అధ్యాపకుల సమస్యల విషయంలో ప్రత్యేక చొరవ చూపి, గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్ టైం ఉపాధ్యాయుల సమస్యలు తప్పక పరిష్కరించా లి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అభయహస్తంలో భాగంగా విశ్వవిద్యాలయాల్లో పనిచేసే పార్ట్ టైం అధ్యాపకులకు 50 వేల రూపాయల కనీస జీతం 12 నెల ల పాటు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు.

అది ఇప్పటికీ అమలుకు నోచు కోలేదు. అయితే ఇటీవల తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్ టైం అధ్యాపకులకు తప్ప మిగిలిన అన్ని సొసైటీ ఉద్యోగులకు జీవో నెం.16, 63 ఇప్పటివరకు అమలు కాకపోవడం భాదాకరం. ప్రభుత్వం తెలంగాణ గి రిజన సంక్షేమ గురుకుల పార్ట్ టైం ఉపాధ్యాయులు నిరుపేద గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం అందిస్తున్న నిర్విరామ సేవలను గుర్తిస్తూ, సమస్యల పరి ష్కారంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. 

 వ్యాసకర్త సెల్: 9949134467