19-11-2025 12:20:36 AM
మరొకరు బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి
కేరళ, రాజస్థాన్, బెంగాల్‌లో ఘటనలు
మూడురాష్ట్రాల్లోనూ బీఎల్వోల నిరసనలు
త్రివేండ్రం/ జైపూర్/ కోల్‌కతా, నవంబర్ 18: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) తమను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందని బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) వాపోతున్నారు. సుదీర్ఘమైన పనిగంటలు తమ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇద్దరు బలవన్మరణానికి పాల్పడటం, ఒకరు బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందడం చర్చనీయాశంమైంది.
పని ఒత్తిడికి తాళలేక తాజాగా కేరళలోని కన్నూరుకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి అనీష్ జార్జ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనిఒత్తిడే అనీష్ మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అలాగే రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముఖేష్ జాంగిడ్ రైలు కింద తలపెట్టి ప్రాణం తీసుకున్నాడు. నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవడంలో వెనుకబడినందుకు తనపై ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచారని, దీంతో తనకు నిద్ర, ప్రశాంతంత కరువైందని ముఖేష్ సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చాడు. పశ్చిమ బెంగాల్‌లోని బర్దమాన్‌కు చెందిన ఉద్యోగి నమితా హన్డా బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందింది.
తీవ్రమైన పని ఒత్తిడి కారణంగానే ఆమెకు తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముగ్గురు ఉద్యోగుల మృతితో కేరళ, రాజస్థాన్, బెంగాల్‌లో బీఎల్వోలు ఆందోళనలకు దిగుతున్నారు. రోజువారీ విధులతో పాటు తాము ‘సర్’ విధులకు హాజరవుతున్నామని, ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు తెలుసుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు.
తమకు కేటాయించిన ఒక్కో పోలింగ్ కేంద్రం ప్రాంతంలో సుమారు వెయ్యి నుంచి 1,200 మంది ఓటర్లు ఉంటారని, ఒక్కో కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఒక్కో బీఎల్వో మూడు, నాలుగుసార్లు వారి ఇంటికి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. ఉన్నతాధికారులు తమ కు డెడ్ లైన్ విధిస్తున్నారని, నిర్దేశిత లక్ష్యాన్ని అధగమించేందుకు ఒక్కొక్కరూ రోజుకు 12 గంటలపాటు నిర్విరామంగా పని చేస్తున్నామని వెల్లడించారు. తమపై పనిభారం త గ్గిం చాలని, లక్ష్యాలను అధిగమించేందుకు మ రింత సమయం ఇవ్వాలని కోరుతున్నారు.
స్వదేశానికి అక్రమ వలసదారులు
పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా ‘సర్’ చేపడుతున్నది. బీఎల్వోలు, ప్రభుత్వ ఉద్యోగు లు ఇంటింటికీ వెళ్లి సర్వేచేపడుతున్నా రు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన అక్రమ వలసదారులు తామెక్కడ దొరికిపోతామోనని తిరిగి వారి స్వస్థలాలకు పయనమవుతున్నా రు. తామెప్పటికైనా దొరికిపోతామని, చట్టపరమైన ఎదుర్కోవాల్సి వస్తోందని వారు భావిస్తున్నారు.
‘సర్’ ప్రక్రి య ఈనెల 4వ తేదీన ప్రారంభం కా గా, ౩, ౪ రోజుల నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. దీనిలో భాగంగానే హకీంపూర్ సరిహద్దు చెక్‌పోస్ట్ మంగళవారం వందలాది మందితో కిటకిటలాడుతూ కనిపించింది. రద్దీని గమనించిన భద్ర తా దళాలు వెంటనే ఆప్రాంతాన్ని మో హరించాయి. నేరస్థులు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందనే ఉద్దేశంతో బలగాలు సరిహద్దుల్లో తనిఖీ లను మరింత ముమ్మరం చేశాయి.