30-08-2025 01:57:01 AM
-- వాహన తనిఖీల్లో పోలీసులకు పట్టుబడుతున్న వైనం
- అడ్డదారుల్లో ఇసుక రవాణా
- దెబ్బతింటున్న గ్రామీణ రోడ్లు
అలంపూర్, ఆగస్టు 29:ఒకప్పుడు తెలంగాణ సరిహద్దు సమీపాన ఉన్న తుంగభద్ర నది నుంచి కొందరు పెద్ద ఎత్తున అక్రమం గా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించేవా రు.కానీ ఇప్పుడు ఆ పంతా మారింది. ఏపీ లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని మార్చింది.దీంతో ఇసుకను ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి హైద్రాబాద్ కు పదులకొద్ది సంఖ్యలో నిత్యం లారీల ద్వారా రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నారు.ఏపీకి చెం దిన కొందరు అక్రమార్కులు ప్రభుత్వ అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో అధికారుల కన్నులు గప్పి అడ్డదారుల్లో ఈ ఇసుక దం దాకు తెర లేపినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర సరిహద్దుతో పాటు ఆయా ప్రాంతాల్లో విధులు ని ర్వహిస్తున్న పోలీసు సిబ్బంది అనుమానాస్పదంగా కనిపిస్తున్న వాహనాలను తనిఖీలు చే యగా ఈతతంగం బయటపడుతోంది.గత కొద్ది రోజులను నుంచి ఇసుక లారీలు పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నాయి.లారీ డ్రై వర్లను అదుపులోకి తీసుకుని కేసులు నమో దు చేసి లారీలను పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. అయితే అడ్డదారుల్లో గ్రామీణ ప్రాం తాల మీదుగా ఇసుక లారీలు వెళ్తుండడంతో రోడ్లు పూర్తిగా దెబ్బ తిని గుంతల మయంగా మారుతున్నాయని ద్వారా ప్రమాదాలు సం భవిస్తున్నాయని గ్రామస్తులు మండి పడుతున్నారు.అధికారులు చర్యలు తీసుకుని అడ్డుక ట్ట వేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
తాడిపత్రి కేంద్రంగా దందా!
ఇసుక మాఫియా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి అనుమతులు తీసుకోకుండా ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ఇసుకను లారీలలో నింపుకొని అడ్డదారుల్లో హైదరాబాద్ కు తరలి స్తున్నట్లు స్పష్టమవుతుంది. పోలీసులకు పట్టుబడిన ప్రతి లారీ తాడిపత్రి కేంద్రం నుంచి రవాణా చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు టోల్ ప్లాజా మరియు సమీప పో లాల మీదుగా రాత్రి వేళల్లో ఇసుకను రవా ణా చేస్తున్నారు.
పోలీసు తనిఖీల్లో గత 5 రోజుల నుంచి గురువారం వరకు పట్టుబడిన ఇసుక లారీలు తాడిపత్రి నుంచి నింపు కొని తరలిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కోదండపురం పీఎస్ పరిధిలో మూడు ఇసుక లారీలను మానవపాడు పీఎ స్ పరిధిలో రెండు, ఉండవల్లి పరిధిలోని ఇటిక్యాలపాడు వద్ద ఒక లారీ, పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద మరొక లారీని పట్టుకుని కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇ సుక తరలిస్తున్న అక్రమార్కుల వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయా అన్న కోణం లో చర్చ జరుగుతుంది.