calender_icon.png 5 July, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తపల్లిలో జరిగిన డ్రామా ఏంటి?

05-07-2025 12:55:10 AM

అర్థవంతమైన వినోదాత్మక చిత్రాలను వెనుదన్నుగా ఉంటూ తెలుగు ప్రేక్షకులకు చేరువవుతోంది రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా. ఇటీవల ఈ సంస్థ సమర్పణలో ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అనే టైటిల్‌తో ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ మూవీ టీజర్ శుక్రవారం విడుదలైంది. గాసిప్‌తో సందడి చేసే పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్.. కలలు, విలేజ్ డ్రామా ఒకదానితో ఒకటి కలిసిపోయే ప్రపంచాన్ని పరిచయం చేసింది.

ఇందులో మనోజ్ చంద్ర రికార్డ్ డ్యాన్స్ స్టూడియో నడిపే యువకుడిగా కనిపించాడు. మోనికా టీ, ఉషా బోనెల, రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేమ్‌సాగర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి గీత సంగీతం: మణి శర్మ; నేపథ్య సంగీతం: వరుణ్ ఉన్ని; డీవోపీ: పెట్రోస్ ఆంటోనియాడిస్; ఎడిటర్: కిరణ్ ఆర్.