calender_icon.png 26 September, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాత్యాయిని దేవిగా అమ్మవారి దర్శనం

26-09-2025 12:00:00 AM

జనగామ, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని  14వ వార్డ్ లో  ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారి మండపంలో దసరా మహోత్సవాలు నాలుగు రోజుకి చేరుకున్నాయి. గురువారం అమ్మవారు కాత్యాయిని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరి అమ్మవారికి అభిషేకం అర్చన పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవ దుర్గా ఉత్సవ సమితి నిర్వాహకులు గన్ను కార్తీక్, గుగ్గిళ్ళు శ్రీధర్, అసర్ల సుభాష్, తుడి దేవరాజు, సంతోష్ రాజ్,తేజ, అఖిల్, శ్రీకాంత్, నాని, చందు, సందీప్, తదితరులు ఉన్నారు.