calender_icon.png 15 August, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎథికల్ హ్యాకర్లకు యాపిల్ బంపర్ ఆఫర్

15-08-2025 01:42:36 AM

  1. ఐ ఫోన్ హ్యాక్ చేస్తే 17.5 కోట్లు

రివార్డ్స్ ప్రకటించిన యాపిల్ కంపెనీ

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఎథికల్ హ్యాకర్లకు యాపిల్ కం పెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్స్ సహా తమ కంపెనీ తయారు చేసే అన్ని ఉత్పత్తులను హ్యక్ చేయగలిగితే కోట్ల రూపాయల బౌం టీ రివార్డులు ఇస్తామని బహిరంగ ప్రకటన చేసింది. ఎథికల్ హ్యాకర్లకు తమ ఉత్పత్తుల్లోని లోపాలను కనుక్కొ ని, తమకు నివేదించే అవకాశాన్ని కల్పించింది. లోపాల ను కనుగొన్న వారికి కనీసం రూ.4 లక్షల రూ.17.5 కోట్ల వరకు ఇస్తామని ప్రకటించింది. ఐదు విభాగాలుగా బహుమతులను విభజించింది. అవి..

ఫిజికల్ యాక్సెస్

హ్యాకర్ ఐఫోన్‌ను భౌతికంగా పట్టుకొని దానిలోని లోపాలను వినియోగించుకోవాలి. ఈ విభాగంలో లాక్ స్క్రీన్‌ను బైపాస్ చేస్తే రూ.83 లక్షల వరకు లభిస్తుంది. లాక్ చేసిన ఫోన్ నుంచి యూజర్ డేటాను చోరీ చేస్తే రూ.2 కోట్లు ఇస్తారు.

ఇన్‌స్టాల్ యాప్ 

యూజర్ ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల ద్వారా లోపాలను ఉపయోగించుకోవాలి. ఈ రకమైన హ్యాకింగ్‌లో రూ.4 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ఇస్తారు. యూజర్ ఇంటరాక్షన్‌తో నెట్‌వర్క్‌పై ఒక క్లిక్‌తో డేటా యాక్సె స్, అథెంటిసిటీ పొందితే రూ.2.18 కోట్ల వరకు బహుమతి ఇస్తారు.

యూజర్ ఇంటరాక్షన్ లేని నెట్‌వర్క్

యూజర్ ఇంటరాక్షన్ లే ని నెట్‌వర్క్ దాడులను జీరోక్లిక్‌గా పేర్కొటారు. ఇందులో యాపిల్ కెర్నల్ పీఏసీ ప్రొటెక్షన్‌ను బైపాస్ చేస్తే 8.3 కోట్ల వరకు లభిస్తుంది.

ప్రైవేట్ క్లౌండ్ కంప్యూట్ డేటాపై..

యాపిల్ ప్రైవేట్ క్లౌడ్‌లో డేటాను చోరీ చేస్తే సుమారు రూ.1.25 కోట్లు లభిస్తుంది. రిమోట్‌గా దాడి చేసి లాక్‌డౌన్ మోడ్‌ను బైపాస్ చేస్తే రూ.17.5 కోట్ల బహుమతి పొందొచ్చు.