calender_icon.png 15 August, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బడికి ఎల్‌ఈడీ టీవీ వితరణ

15-08-2025 01:55:29 AM

కార్పొరేటర్ అర్చనాజయప్రకాష్ దంపతులకు సన్మానం

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 14 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ నియోజకవర్గం రాజేంద్రనగర్ డివిజన్ ఎర్రబోడ ప్రైమరీ స్కూల్‌కు రాజేంద్రనగర్ కార్పోరేటర్ అర్చనజయప్రకాష్ దంపతులు ఎల్‌ఈడి స్మార్ట్ టీవీ, సౌండ్ సిస్టంను గురువారం బహుకరించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు కార్పొరేటర్ దంపతులను సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ అర్చన జయప్రకాష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను  చేర్పించాలని కోరా రు. దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో మరిన్ని మౌలిక సదుపాయాల కల్పించా లని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్  డివిజన్ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి, జీవన్‌దాస్, సూర్యప్రకాష్‌రెడ్డి, రాజేష్, గిరిబాబు, ప్రేమ్‌రాజ్, రాహుల్, రాముచారి పాల్గొన్నారు.