calender_icon.png 15 August, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికపై లైంగికదాడి కేసు.. నిందితుడికి ఉరి శిక్ష

15-08-2025 01:59:18 AM

  1. రూ.1.10 లక్షల జరిమానా 

నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు

2013లో మైనర్  లైంగిక దాడి, హత్య

నల్లగొండ టౌన్, ఆగస్టు 14 (విజయక్రాంతి): బాలికపై లైంగిక దాడి చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ గురువారం నల్లగొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిం ది. దాంతో పాటు రూ.1.10 లక్షల జరిమానా కూడా విధించింది. నల్లగొండలో నివాసం ఉం టున్న మొహమీ ముక్రమ్ 2013 ఏప్రిల్ 28న మన్యం చెల్కలో హైదర్‌ఖాన్‌గూడలో బాలిక(12)పై లైంగిక దాడి చేశాడు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడి చేయడంతోపాటు చంపేశాడు. అనంతరం బాలిక మృత దేహాన్ని ఇంటి వద్ద ఉన్న నాలాలో పడేశాడు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేప ట్టి, మూడు రోజుల తర్వాత బాలిక మృతదేహాన్ని నాలాలో గుర్తించారు. నిందితుడిని గుర్తిం చిన పోలీసులు నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

2015లో చార్జిషీట్ దాఖలైంది. ఈ కేసుపై పదేండ్లుగా జిల్లా కోర్టులో ఇరు పక్షాల వాదనలు జరిగాయి. నిందితుడిపై నేరం రుజువు కావడంతో పోక్సో, హత్యా నేరం కేసులో పోక్సో కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి రోజారమణి గురువారం సంచలన తీర్పు వెలువరించారు.

నిందితుడికి ఉరి శిక్షతో పాటు -రూ.1.10 లక్షల జరిమానా విధించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. నిందుతుడికి ఉరిశిక్ష విధించడంపై బాధి త కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ కూతురుకు ఇన్నేళ్ల తర్వాతైనా న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.